తానా బ్యాక్ ప్యాక్ పంపిణీ మసాచుసెట్స్ : పేద విద్యార్థులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 'బ్యాక్ ప్యాక్' పేరుతో స్కూల్ బ్యాగ్ లు, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారంనాడు మసాచుసెట్స్ రాష్ట్రంలోని వార్సెస్టర్, బోస్టన్ నగరాల్లో 550 బ్యాక్ ప్యాక్ లు పంపిణీ చేసినట్లు తానా కార్యదర్శి నన్నపనేని మోహన్ తెలిపారు. అమెరికా అంతటా తానా అధ్యక్షుడు జయరాం కోమటి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ సూరపనేని లక్ష్మీనారాయణ, కోశాధికారి రాం యలమంచిలి ఆధ్వర్యంలో వేలాది బ్యాక్ ప్యాక్ లను పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వార్సెస్టర్ లోని యూనియన్ హిల్ స్కూల్, కాంటర్బరీ స్ట్రీట్ స్కూల్ లో జరిగిన బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమానికి వార్సెస్టర్ నగర మేయర్ కాన్స్ టాంటిన లూక్స్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ, తానా సేవా కార్యక్రమాన్ని ప్రశంసించారు. వార్సెస్టర్, బోస్టన్ నగరాల్లో జరిగిన బ్యాక్ ప్యాక్ ల పంపిణీ కార్యక్రమానికి ఫ్రెండ్స్ ఫౌండేషన్ బ్యాక్ ప్యాక్ లు అందజేసినట్లు మోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా సభ్యులు డాక్టర్ ముద్దన హరిబాబు, తమ్మిశెట్టి బాబు, గోవిందరావు, పూర్ణారావు, పాపారావు, డాక్టర్ సత్యం, డాక్టర్ వెంకటరెడ్డి, ఎస్. మనోహర్, కొల్లిపర శ్రీనివాస్, పొట్లూరి కుమార్, సోంపురం శశి, కన్నెగంటి మూర్తి, సురేన్ నన్నపనేని, స్వాతి బొలినేని, రమ్య తమ్మిశెట్టి, శృజన తమ్మిశెట్టి, నితిన్, హిరేన్ తదితరులు పాల్గొని, సహాయ సహకారాలు అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ హరిబాబు ముద్దన మాట్లాడుతూ, ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అమెరికాలోని భారతీయులపైన మరింత గౌరవం పెరుగుతుందన్నారు. నన్నపనేని మోహన్ ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News Posted: 18 September, 2009
|