దీపావళిలో మొగుడ్స్ పెళ్ళామ్స్ న్యూజెర్సీ : ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా అమెరికాలోని తెలుగు కళా సమితి ఓ వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ దాము గేదెల ఒక ప్రకటనలో తెలిపారు. 'మొగుడ్స్ అండ్ పెళ్ళామ్స్' పేరుతో సరికొత్తగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోటీలో వయస్సుతో నిమిత్తం లేకుండా దంపతులందరూ పాల్గొనవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో రకరకాల పోటీలు, ఆటలు, పాటల పోటీలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు దాము గేదల తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు తమ అంగీకారాన్ని అక్టోబర్ 11 లోపల తమకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1960 నుంచి 2000 సంవత్సరం వరకూ వచ్చిన సినిమాలలోని మంచి మంచి పాటలకు డాన్స్ నేర్చుకొని పోటీల్లో ప్రదర్శించి చక్కని బహుమతులు కూడా గెలుచుకోవచ్చని ఆయన తెలిపారు.
అక్టోబర్ 24 శనివారం తెలుగు కళా సమితి నిర్వహించున్న దీపావళి సంబరాల్లో అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరూ పాల్గొన వచ్చని దాము గేదల తన ప్రకటనలో ఆహ్వానించారు. న్యూజెర్సీలోని ఫ్రీహోల్డ్ హైస్కూల్ లో అక్టోబర్ 24న దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు దాము వివరించారు. అమెరికాలో ఎలాంటి లాక్షాపేక్షా లేకుండా సుదీర్ఘకాలంగా విజయవంతంగా నడుస్తున్న సంస్థల్లో తెలుగు కళా సమితి ఒకటని ఆయన పేర్కొన్నారు. తెలుగు కళా సమితి దీపావళి సంబరాల్లో సుమారుగా వెయ్యి మంది తెలుగువారు హాజరయ్యే అవకాశం ఉందని తాము భావిస్తున్నామన్నారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు, సంగీతం తదితర అంశాలను ప్రవాసాంధ్రుల పిల్లకు పరిచయం చేయడంలో తమ సంస్థ సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు కళా సమితి దీపావళి సంబరాలకు హాజరయ్యే అతిథులకు అందుబాటులో ఉండే ధరల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామని దాము గేదల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉదార స్వభావం గల దాతలు విరాళాలు, స్పాన్సర్ షిప్ లతో తమను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాల కోసం 856-577-7112 at president@tfas.net ను సంప్రతించవచ్చు.
స్పాన్సర్ షిప్ వివరాలు ఇలా ఉన్నాయి :
Sponsor Items: You can choose:
Backdrop main stage Logo.. like last year $500 includes Family Admission
Chinnarulu Competition Participant Trophies sponsor: $1000
Awards Winners sponsor: $1500 – Cultural Show $2000 to $3000
Food sponsor: $4800 – School and audio - $3500.
News Posted: 23 September, 2009
|