జీవనంలో శాస్త్రీయ దృక్పథం

చికాగో : 'పురాణ ప్రలాపం' గ్రంథం మన రోజువారీ జీవనవిధానంలో 'శాస్త్రీయ దృక్పథం' గురించి ప్రస్తావించిన అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో హిందీ ప్రొఫెసర్ పనిచేసి ఇటీవలే రిటైరైన జెఎల్ రెడ్డి హిందీ నుంచి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. చికాగో సాహితీ మిత్రులు సాహితీ సంస్థ ఈ గ్రంథంపై సెప్టెంబర్ 20 ఆదివారంనాడు చర్చా గోష్ఠి నిర్వహించింది. చికాగోలోని వెస్ట్ మాంట్ పబ్లిక్ లైబ్రరీలో ఈ చర్చా గోష్ఠి ఏర్పాటు చేసినట్లు సంస్థకు చెందిన జయదేవ్ మెట్టుపల్లి తెలిపారు. ఈ గ్రంథంలో ప్రొఫెసర్ రెడ్డి ప్రస్తావించిన జీవనంలో శాస్త్రీయ అంశాల పట్ల గోష్ఠిలో పాల్గొన్న సాహితీవేత్తలు ప్రశంసించారు.
చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి ప్రకాశ్ తిమ్మాపురం అతిథులకు స్వాగతం పలికారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ రవిరెడ్డి గ్రంథ రచయిత ప్రొఫెసర్ జెఎల్ రెడ్డికి జ్ఞాపిక అందజేసి సన్మానించారు. చర్చాగోష్ఠికి హాజరైన అతిథులకు జయదేవ్ మెట్టుపల్లి, డాక్టర్ విశ్వనాథ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 23 September, 2009
|