ఫండ్ రైజర్ నవరాత్రోత్సవం న్యూజెర్సీ : ఈ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులను ఫండ్ రైజ్ ఉత్సవాలుగా నిర్వహిస్తున్నట్లు హిందూ అమెరికన్ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి మహేందర్ ముసుకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వసూలైన నిధులను న్యూజెర్సీ మోర్గాన్ విల్లేలోని 31 వూలే టౌన్ రోడ్ లో నిర్మాణంలో ఉన్న కృష్ణాలయం కోసం వినియోగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ ఉత్సవాలలో భాగంగా కనకదుర్గ అమ్మవారికి అలంకరించిన డైమండ్ నెక్లెస్ ను లక్కీ డ్రా ద్వారా విజేతకు అందజేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వంద డాలర్ల విలువైన డొనేషన్ టిక్కెట్ తీసుకున్న మొదటి వెయ్యి మంది టిక్కెట్ నెంబర్లను డ్రా తీసి డైమండ్ నెక్లెస్ ను అమ్మవారి ఆశీస్సులతో పాటు అందజేయనున్నట్లు ఆయన వివరించారు. అలాగే నవరాత్రి ప్రత్యేక ప్రమోషన్ కింద తమ పిల్లల పేరు మీద 501 డాలర్లతో ఆలయం నిర్మాణానికి ఇటుకను స్పాన్సర్ చేసిన వారికి 100 డాలర్ల టిక్కెట్ ఉచితంగా పొంది డైమండ్ నెక్లెస్ లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు మహేందర్ ముసుగు వివరించారు.
ఈ నెల 27 శనివారంనాడు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ గణేష్, దుర్గా పూజ నిర్వహిస్తున్నట్లు మహేందర్ ముసుకు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ కొత్తగా నిర్మిస్తున్న కృష్ణాలయం, పూజారుల నివాసాల సందర్శన, ఒంటి గంట నుంచి శ్రీ కృష్ణ మందిరం (గురువాయురప్పన్ టెంపుల్)లో కృష్ణాలయం నిర్మాణానికి నిధుల సేకరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. పిమ్మట హెల్త్ ఫెయిర్, భాష, సాంస్కృతిక అంశాల శిక్షణ తరగతులకు ఇంట్రడక్షన్ ఉంటుందన్నారు.
టిక్కెట్లు తీసుకోదలచిన వారు http://www.medhanet.com/krishnatemple వెబ్ సైట్ లో సైన్ అప్ కావచ్చని మహేందర్ ముసుకు తెలిపారు.
ఇతర వివరాలు తెలుసుకోవాలంటే :
Contact any of the volunteers to get the tickets and pledge forms.
Dr. Lakshmi Nandiwada 908-216 6501, Nandu Balija 732-668-9871,
Ramana Koganti 732-725-1854, Mahender Musuku 732-794-0475,
Mohan Patlola 732-447-4435, Ramesh Chandra 732-979-8560,
Satya Nemana 732-762-7104, Vinod Koduru 732-319-4296,
Satish Dasari 732-803-0666, Suresh Reddy 732-331-0371,
Yogesh Patel 908-500-0500, Punnam Mantheng 732-648-4039,
Damu Gedala 856-577-7112, Krishna Oruganti 732-617-1290,
Anand Paluri 2012073214, Ravindra Peddi 9173406897,
Pradip Suvarna 9088388783, Sunanda Thali 7325799989,
Contact temple office 732-972-5552, devotees@KrishnaTemple.org సంప్రతించవచ్చు.
News Posted: 24 September, 2009
|