యూటా మహిళా సంబరాలు న్యూజెర్సీ : సమైక్య తెలుగు అమెరికా సంఘం (యూటా) ఆధ్వర్యంలో అక్టోబర్ 25 ఆదివారం నాడు మహిళా సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోర్డ్స్ లోని కింగ్ జార్జి రోడ్డులో ఉన్న రాయల్ ఆల్బెర్ట్ ప్యాలెస్ లో ఈ సంబరాలు జరుగుతాయని యూటా పేర్కొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖుల ప్రసంగాలు, డి.జె. డ్యాన్సింగ్, ఫ్యాషన్ షో, క్రీడాపోటీలు, జువెలరీ, సాంప్రదాయ దుస్తుల ధారణ, మెహిందీ బూత్ లు, రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేసినట్లు, విజేతలకు ఆశ్చర్యం గొలిపే బహుమతులు ప్రదానం చేయనున్నట్లు యూటా నిర్వాహకులు వివరించారు. ఆ రోజు ఊదయం 11.30 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. ఈ సంబరాల్లో పాల్గొనదలచిన వారు www.utaaworld.org ఆన్ లైన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. సంబరాల్లో పాల్గొనే యూటా సభ్యులు ప్రతి ఒక్కరూ 10, సభ్యులు కాని వారైతే 20 డాలర్ల చొప్పున ప్రవేశ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సంబరాలకు ఆకర్షణీయంగా దుస్తులు ధరించిన మహిళకు 'బెస్ట్ డ్రెస్డ్ విమెన్ ఆఫ్ ది డే'గా కిరీటాన్ని గెలుచుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు 18 ఏళ్ళ వయస్సు దాటిన మహిళలే అర్హులని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఇతర వివరాలు తెలుసుకోవాలంటే :
కల్పన సువర్ణ - (732) 470-3376, శోభ బొడ్డు - (908) 342-2198, లత మన్యం - (973) 964-4249, అనూష బూపతి - (732) 429-3890, బిందు మాదిరాజు - (732) 609-1836, వరూధిని మిట్టా - (732) 690-4653, రమ ప్రెసింగు - (732) 636-9403, జమున పుస్కర్ - (732) 662-4117, సాధన నరవ్ - (732) 261-3948, డాక్టర్ లక్ష్మి నందివాడ - (908) 216-6501 లను సంప్రతించవచ్చు. ఈ సంబరాలను టివి 9 ప్రత్యక్ష ప్రసారం చేయనున్నదని నిర్వాహకులు తెలిపారు.
News Posted: 25 September, 2009
|