సాయి పరివార్ దీవాళి పండుగ న్యూజెర్సీ : అక్టోబర్ 1 ఆదివారం దీపావళి సంబరాలు నిర్వహిస్తున్నట్లు సాయి పరివార్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా ఈ సంస్థ భక్తి, ప్రేమ, శాంతి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. తాజాగా సాయి పరివార్ న్యూజెర్సీలో షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించ తలపెట్టింది. ఎడిసన్ లోని ఉడ్ బ్రిడ్జి ఎవెన్యూలో ఉన్న హాలిడే ఇన్ హొటల్ లో నిర్వహించే దీపావళి సంబరాల్లో లక్ష్మీ పూజ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహూతులకు స్నాక్స్, మంచి రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేసింది. ఆ రోజున మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకూ దీపావళి సంబరాలు నిర్వహించేందుకు సాయి పరివార్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంబరాల్లో పాల్గొనే వారు ఒక్కొక్కరూ 15 డాలర్లు విరాళంగా అందజేయాలని విజ్ఞప్తి చేసింది. ఇలా వసూలైన విరాళాల పూర్తి మొత్తాన్ని సంస్థ న్యూజెర్సీలో నిర్మించనున్న షిర్డీ సాయిబాబా ఆలయానికే వినియోగించనున్నట్లు సాయి పరివార్ సంస్థ పేర్కొంది. ఐదేళ్ళ లోపు పిల్లలకు సంబరాల్లో పాల్గొనేందుకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణం కోసం వివిధ కమిటీలను కూడా సాయి పరివార్ సంస్థ ఏర్పాటు చేసింది.
సలహా కమిటీ సభ్యులు : ఉపేంద్ర జె. చివుకుల, వీరు పాటిల్, శామ్ దని, రవీందర్ తోట, భరత్ మెహతా, రాజ్ మాథుర్, డాక్టర్ శ్రీనివాస్ ఈశ్వరపు, జగదీష్ మసంద్, బిమల్ జోషి, రవి దన్నపునేని, కమలేష్ గజ్జర్, నీలేష్ దసోండి, శ్రీధర్ చీమలదిన్నె.
సావనీర్ కమిటీ సభ్యులు : రమేష్ మాగంటి, ఉమ బహుమన్యం.
మార్కెటింగ్ & మీడియా : ముఖేష్ కాశీవాలా.
ఫుడ్ & క్యాటరింగ్ : భాస్కర్ భూపతి, ఠాకూర్ బుల్సారా, తుహిన్ పాండ్య.
ఎంటర్ టైన్ మెంట్ కమిటీ : నిపుల్ పటేల్, సన్నీ సింగ్, డాక్టర్ యశ్ ఖన్నా, ప్రకాశ్ బహుమన్యం.
రిసెప్షన్ కమిటీ : సుధ బహుమన్యం, ప్రతిభ ఈశ్వరపు, అశోక్ జవేరి, భావన సాహని.
సెక్యూరిటి & ఫెసిలిటి కమిటీ : దీపక్ ఠాకూర్, కాను పటేల్, ప్రకాశ్ చౌహాన్.
అలంకరణ : శైలేష్ పటేల్.
దీపావళి సంబరాలకు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవాలంటే :
గురూజీ - 732-744-9585, గిరీష్ బారోట్ - 201-222-0232, ముకుంద్ పారిఖ్ - 732-205-9437, ఠాకూర్ బుల్సారా - 732-910-8313, అనిల్ భట్ - 732-727-2757, శరద్ త్రివేది - 732-801-3348 నెంబర్లలో సంప్రతించవచ్చు.
News Posted: 25 September, 2009
|