సిటిఎ గాంధీ జయంతి వేడుక
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/gan.gif' align='right' alt=''>
చికాగో : పూజ్య బాపూజీ, భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంత్యుత్సవాలను అక్టోబర్ 3 శనివారంనాడు చికాగో తెలుగు సంఘం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్ స్టన్ నగరంలోని లేక్ స్ట్రీట్ లో ఉన్న ఎం.ఎల్. కింగ్ ల్యాబ్ స్కూల్లో ఆ రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ నిర్వహించే గాంధీ జయంత్యుత్సవాలకు ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సిటిఎ ప్రతినిధి రావు ఆచంట ఒక ప్రకటనలో ఆహ్వానించారు. చికాగో తెలుగు అసోసియేషన్ తొలిసారిగా నిర్వహిస్తున్న జాతిపిత జయంత్యుత్సవాల్లో పాల్గొని మహాత్ముని పట్ల మనకు ఉన్న పూజ్యభావాన్ని ప్రకటించుకోవాలని ఆయన కోరారు.
గాంధీ జయంత్యుత్సవాల్లో ముఖ్య విశేషాలు :
- గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించడం
- గాంధీ అహింసా సిద్ధాంతంపై పిల్లలకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు
- రక్త దాన శిబిరం
- గాంధీ జీవితం, ఆయన కార్యక్రమాలపై డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన
- అవార్డుల ప్రదానం ఉంటాయి
సిటిఎ రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేయదలచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని రావు ఆచంట విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇతర పూర్తి వివరాలను చికాగో తెలుగు అసోసియేషన్ వెబ్ సైట్ www.chicagoteluguassociation.org లో చూడవచ్చు.
News Posted: 26 September, 2009
|