'నాట్స్' ఆహార సేకరణ

న్యూజెర్సీ : భారత జాతి పిత, పూజ్య బాపూజీ, మహాత్మాగాంధీ 140వ జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 2న ఉత్తర అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) నిరుపేదలు, ఆకలితో అలమటించే వారి కోసం ఆహార సేకర కార్యక్రమం నిర్వహిస్తున్నది. న్యూజెర్సీలోని వివిధ కేంద్రాల్లో నాట్స్ సంస్థ ఏర్పాటు చేసిన 'ఫుడ్ బాక్స్ ల'లో దాతలు ఉదారంగా ఈ దిగువన సూచించిన విధంగా ఆహార పదార్థాలను ఉంచాలని సంస్థకు చెందిన మోహన్ కృష్ణ మన్నవ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ ఆహార పదార్థాలను ఆయా ప్రాంతాల్లో ఉన్న నాట్స్ సంస్థ ప్రతినిధులు నిరాశ్రయులకు, చర్చిల వద్ద ఉండే నిరుపేదలకు పంపిణీ చేస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.
గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్ లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 140 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2న జన్మించారు. పూజ్య గాంధీజీ జన్మదినోత్సవాలు ఎన్నో రకాలుగా, ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నామని, ఈ జన్మదినోత్సవాన్ని కాస్త విభిన్నంగా నిర్వహించాలని నాట్స్ సంస్థ ఆలోచించి, నిరుపేదలకు పంపిణీ చేసేందుకు ఆహార సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మోహన్ కృష్ణ మన్నవ వివరించారు.

నాట్స్ సంస్థకు దాతలు ఈ దిగువన పేర్కొన్న ఆహార పదార్థాలను ఫుడ్ బాక్స్ లలో వేయవచ్చు:
Non-Perishable Food Items:
- Peanut Bu
- 100% Canned or Dry Juice
- Instant mashed Potatoes
- Pasta / Macaroni
Non-Food Items :
- Canned Tuna Fish
- Canned Fruit
- Canned Vegetables
- Dry / Powdered Milk
- Evaporated Milk
- Rice
- Beans
- Crackers
- Macaroni & Cheese
- Canned soups
- Coffee or Tea
- Sugar
- Flour
- Grits
- Pancake Mix
- Canned Ravioli / Spaghetti
- Diapers
- Soap
- Hand Sanitizers
పై వస్తువులను ఈ కింది పేర్కొన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఫుడ్ బాక్స్ లలో దాతలు వేయవచ్చని మోహన్ కృష్ణ మన్నవ తెలిపారు.
1 ) Dakshin Express, Oak Tree
2) Dakshin Indian Cuisine, Isilin
3) Abhiruchi Restaurant, Isilin
4) Abhiruchi Restaurant, North Brunswick
5) patel cash and carry, iselin
6) apna bazar, iselin
7) sabji Mandi,Iselin
9) oak tree movie theaters, iselin
10) Baba hut, jersey city
News Posted: 30 September, 2009
|