'గీత' బతుకమ్మ పండుగ

ఇండియానాపోలీస్ : గ్రేటర్ ఇండియానాపోలీస్ తెలుగు అసోసియేషన్ (గీత) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సెంట్రల్ ఇండియానాపోలీస్ లో ఉన్న హిందూ దేవాలయం ఆవరణలో సెప్టెంబర్ 26 ఆదివారం జరిగిన ఈ ఉత్సవాల్లో ఆంధ్ర రాష్ట్రంలోని తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఇక్కడ స్థిరపడిన సుమారు 50 మంది మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతోను, ఉత్సాహంతోను పాల్గొన్నారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. అనంతరం దేవాలయం సమీపంలోని సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ ఉత్సవాలను శోభారెడ్డి, ప్రసన్న చింతల, ఝాన్సీ గజ్జల ఇతర వలంటీర్లతో చక్కని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. గీత కార్యదర్శి రాము చింతల, కోశాధికారి హరీష్, గీత కార్యనిర్వాహక సంఘం సభ్యులు ఈ ఉత్సవాలను సమన్వయం చేశారు. ఉత్సవాల అనంతరం నిర్వాహకులు చక్కని రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇండియానాపోలిస్ లో తొలిసారిగా జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలంతా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.
News Posted: 30 September, 2009
|