బాధితులకు 'ఐనాక్' బాసట కాలిఫోర్నియా : ఉగ్రరూపంలో వచ్చి పడిన కృష్ణానది వరదలతో తల్లడిల్లిపోతున్న బాధితులను ఆదుకునేందుకు ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ విభాగం ఉదారంగా ముందుకు వచ్చింది. కృష్ణ వరదల కారణంగా ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని, నది పరీవాహక ప్రాంతంలోని వేలాది మంది ప్రజలు రెండు రోజులుగా నీరు, ఆహారం లేకుండా అలమటించిపోతున్నారని ఎపి ఐనాక్ ప్రెసిడెంట్ మహేష్ సలాది ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని అనేక గ్రామాల్లో 10 -15 అడుగుల మేర వరదనీరు చేరిపోవడంతో వృద్ధులు, చిన్నారులతో సహా ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రజలు ఇంటి పైకప్పులపైనే బిక్కు బిక్కుమంటూ ఆహారం, మంచినీలు లేకుండానే దుర్భరంగా గడుపుతున్నాన్నారు. ఆపదలో ఉన్న మనవారి కోసం అందరం సహాయం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు.
ఆంధ్రరాష్ట్రం ఇప్పుడు వరదలతో ప్రమాదంలో పడిందని, వరద సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎపి ఐనాక్ సంస్థ ముందుకు వచ్చిందని, సంస్థతో చేతులు కలిపి ఇబ్బందుల్లో ఉన్న మన సోదర సోదరీమణులను రక్షించేందుకు ఉదారంగా ముందుకు రావాలని మహేష్ సలాది పిలుపునిచ్చారు. వరద బాధితులకు సహాయం కోసం ఎపి ఐనాక్ ఈ నెల 6 మంగళవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొనాల్సిందిగా మహేష్ సలాది పిలుపునిచ్చారు. ఫోన్ నెంబర్ 712-432-0080, కోడ్ 852730# (Limited Access)లో కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొనవచ్చన్నారు.
ఇతర వివరాలు తెలుసుకోగోరితే :
516-946-8400 or 516-551-7707
or Members of Executive Committee ని సంప్రతించవచ్చు.
News Posted: 3 October, 2009
|