'వరద'పై కవిసమ్మేళనం హ్యూస్టన్ : 'వరద విపత్తు'పై వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కవిసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు తెలిపారు. అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో ఈ కవిసమ్మేళనం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల నెలా నిర్వహిస్తున్న 'నెల నెల తెలుగు వెన్నెల' 20 కార్యక్రమంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కవిసమ్మేళనానికి జ్ఞానపిఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి. నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగాను, ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ పి.విజయబాబు సభాధ్యక్షులుగా పాల్గొంటున్నారు. కవి సమ్మేళనంలో శారదా అశోకవర్థన్, డాక్టర్ వాసా ప్రభావతి, డాక్టర్ జె.బాపురెడ్డి, డాక్టర్ బిఎన్ రెడ్డి, డాక్టర్ ఎం.కె. రాము, డాక్టర్ ద్వానా శాస్త్రి, ఆచార్య టి. గౌరీశంకర్, ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి, డాక్టర్ చిల్లర భవానీదేవి, శిఖామణి, మహేజబీన్, ఎన్. అరుణ, డాక్టర్ ముక్తేవి భారతి, ఓలేటి పార్వతీశం, దాసరి అంజనాదేవి, డాక్టర్ తెన్నేటి సుధ, సుధామ, దర్భశయనం శ్రీనివాసాచార్య, ఆశారాజు పాల్గొంటారు.
News Posted: 16 October, 2009
|