సాయి విగ్రహ ప్రతిష్ఠ మిచిగాన్ : రాష్ట్రంలోని లివోనియా నగరంలో శ్రీ షిరిడీ సాయిబాబా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు మిచిగాన్ శ్రీ షిరిడీ సాయి సంస్థాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 శనివారం ఉదయం 8.45 నిమిషాలకు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ అనంతరం గణేష, దత్తాత్రేయ విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై పునీతులు కావాలని సంస్థ ఆహ్వానించింది. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఐదు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని సాయిబాబా కృపకు పాత్రులు కావాలని సంస్థాన్ భక్తులకు పిలుపునిచ్చింది.
News Posted: 19 October, 2009
|