జిహెచ్ హెచ్ఎఫ్ ఆహ్వానం న్యూజెర్సీ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆలయాల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న గ్లోబర్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ (జిహెచ్ హెచ్ఎఫ్) నిధుల సేకరణ కోసం వచ్చే డిసెంబర్ 6వ తేదీన గొప్ప సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా పసుమర్తి శర్మ - శ్రీమతి సునంద ఆకుల వారి బృందం 'మహిషాసుర మర్ధిని' అనే ప్రసిద్ధ కూచిపూడి డ్యాన్స్ బాలే ఇస్తున్నారు. అలాగే 'నవరస నట భామిని' అనే మరో ప్రత్యేక కూచిపూడి నృత్య ప్రదర్శనను శ్రీమతి స్వాతి గుండపునీడి, ఆమె బృందం ప్రదర్శించనున్నది. న్యూజెర్సీ రాష్ట్రంలోని బ్రిడ్జివాటర్ నగరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఆ రోజున మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ జరుగుతాయని జిహెచ్ హెచ్ఎఫ్ ప్రతినిధి సత్య నేమన ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా వసూలయ్యే నిధులను ఆలయాల పరిరక్షణ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించనున్నట్లు సత్య నేమన స్పష్టం చేశారు. అలాగే న్యాయవిరుద్ధంగా జరుగుతున్న పలు ఆలయాల ఆస్తుల విక్రయాలను నిలిపివేత కోసం హైకోర్టులో సంస్థ నడుపుతున్న కేసు ఖర్చులకు ఈ నిధులను వినియోగించనున్నట్లు చెప్పారు. నిధుల సేకరణ సాంస్కృతిక కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
జిహెచ్ హెచ్ఎఫ్ నిధుల సేకరణ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరయ్యే వారు 50గాని, 25గాని, 10 డాలర్లు గాని (పన్ను మినహాయింపు సౌకర్యం ఉంది) ఆన్ లైన్ లో www.SaveTemples.org లో విరాళంగా చెల్లించాలని సత్య నేమన స్పష్టం చేశారు. అల్పాహారం సరఫరా చేసే ఈ కార్యక్రమంలో 8 సంవత్సల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం అన్నారు. వేదిక వద్ద 12 డాలర్లు చెల్లించి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు కావచ్చన్నారు.
ఇతర వివరాలు తెలుసుకోవాలంటే :
Satya Nemana (732) 762-7104, Sunanda Thali (732) 252-6792, Umesh Shukla (908)240-7720, Vasant (732) 319-8155, Prasad (630) 418-1122, Swathi (732) 429-2948, Email: savetemples@gmail.com లో సంప్రతించవచ్చు.
News Posted: 2 November, 2009
|