కాలిఫోర్నియాలో విరాళం విందు

కాలిఫోర్నియా : ఆంధ్రరాష్ట్రంలో ఇటీవల పెద్ద ఎత్తున సంభవించిన వరదల్లో నష్టపోయిన వారికి సహాయం చేసేందుకు ప్రవాసాంధ్రులు ఉదారంగా ముందుకు వచ్చారు. స్థానిక ఇర్విన్ ఆలయ ప్రాంగణంలో నవంబర్ 1ఆదివారం నిర్వహించిన ఈ విరాళాల విందులో సుమారు 100 కుటుంబాల ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తద్వారా 4వేల డాలర్లు వసూలయ్యాయి. అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల బృందం ఏర్పాటు చేసిన ఈ నిధుల సేకరణ విందుకు చక్ర కుషన్, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సంస్థలు స్పాన్సర్ చేశాయి. ఈ కార్యక్రమంలో చక్ర కుషన్ యజమాని రవి కోనేరు, ఎకనామిక్ డెవలప్ మెంట్ కమిషనర్ ఆఫ్ చారిటీస్ పాట్ పట్నాయక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్క్ వెస్ట్ అపార్ట్ మెంట్స్ లో పలువురు స్థానిక చిన్నారులు - పెద్దలు సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు పరమేశ్వరన్, ఆయన బృందం, సుర్ మ్యూజిక్ అకాడమీ వారు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన రవి మాదల, రవి కోనేరులకు కార్యక్రమ నిర్వాహకులు కృతజ్ఞలు తెలిపారు. విరాళాల విందు కార్యక్రమాన్ని తనతో పాటు నివసిస్తున్నవారు, మిత్రులు, కొలీగ్స్ సహకారంతో నారాయణరావు అమ్మిశెట్టి రూపొందించి, నిర్వహించారు. వరద బాధితులను ఆదుకోవడం అనే ఒక మంచి కార్యక్రమం కోసం ఉత్సాహంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేసిన ప్రతి ఒక్క ప్రవాసాంధ్రునికీ, కుటుంబానికీ నిర్వాహహకులు ధన్యవాదాలు తెలిపారు.
News Posted: 3 November, 2009
|