బాధితుల కోసం బెనిఫిట్ షో టెక్సాస్ : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు సహాయం చేసేందుకు నవంబర్ 7 ఆదివారం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్ టెక్స్), తానా, ఆటా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బెనిఫిట్ షో నిర్వహిస్తున్నట్లు టాన్ టెక్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రిస్కోలోని సెంటెన్నియల్ హైస్కూల్ లో ఆ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ బెనిఫిట్ షో జరుగుతుంది. ఈ బెనిఫిట్ షో లో సినీ హాస్య నటులు అనంత్, గుండు హనుమంతరావు, నటీమణులు అపూర్వ, మనోజ తదితర సినీ కళాకారులు పాల్గొంటున్నారు. బెనిఫిట్ షోలో భాగంగా నటుల హాస్యరస కార్యక్రమాలు, ప్రముఖ తెలుగు సినీ కళాకారుల డ్యాన్స్ లు నిర్వహిస్తున్నట్లు టాన్ టెక్స్ వివరించింది. బెనిఫిట్ షో ద్వారా సమకూరే నిధులను ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయం కోసం వినియోగించనున్నట్లు వెల్లడించింది.
బెనిఫిట్ షో కు హాజరు కాగోరువారు విందు భోజనంతో కలిపి 10, 20 డాలర్లు, విఐపి టిక్కెట్ 50 డాలర్లు, స్పాన్సర్స్ టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని టాన్ టెక్స్ పేర్కొంది. విందు భోజనాన్ని సారేగామా కేఫ్ & సూపర్ మార్కెట్ సరఫరా చేస్తున్నది. చిట్టచివరి నిమిషంలో టిక్కెట్ దొరకలేదని ఆశాభంగం చెందకుండా ఉండాలంటే ముందు కొన్నవారికి ముందు ప్రాతిపదికన ఆన్ లైన్ లో టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. టిక్కెట్లను ekNaxar.com లో పొందవచ్చు. బెనిఫిట్ షో స్పాన్సర్లుగా Softschools.com, Dr. Tara Reddy, Chalapati Rao Kondrakunta, Eknazar.com, FunAsia Radio, Discover Travels, Mayuri, JP Reddy, Arvind Reddy, Southfork Dental, Ajay Reddy వ్యవహరిస్తున్నారు. టిక్కెట్లు, ఇతర వివరాలు తెలుసుకోవాలంటే...
Sridhar R Korsapati - 972 897 5612
Murali Vennam - 817 965 2500
Satish Reddy - 214 476 4771
Ram Yalamanchili - 214 663 6363
Prasad Thotakura 817 300 4747
Srinivas Reddy Gunukula - 214 498 2014
Chandra Kanneganti - 817 845 5433
Ananth R Pajjur - 972 333 5543
Rao Kalavala - 732 309 0621
Srinivas Reddy Gurram - 817 808 3443
లను సంప్రతించవచ్చు.
News Posted: 3 November, 2009
|