టాస్క్ దీపావళి సంబరాలు
http://telugupeople.com/uploads/tphome/images/2009/cal.gif' align='right' alt=''>
కాలిఫోర్నియా : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు నవంబర్ 1వ తేదీన దీపావళి సంబరాలను తెలుగు అసోసియేషన్ ఆఫ సదర్న్ కాలిఫోర్నియా (టిఎఎస్ సి - టాస్క్) వైభవంగా నిర్వహించింది. నార్వాక్ లోని ఎక్స్ సెల్సియర్ స్కూలు ఆడిటోరియంలో కన్నులపండువగా, ఆనందోత్సాహాల మధ్య జరిగిన దీపావళి సంబరాల్లో అనేక మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సంబరాల్లో భాగంగానే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధిత ప్రాంతాల ప్రజల సహాయార్థం టాస్క్ విరాళాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించిందని సంస్థ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి తెలిపారు.
దీపావళి సంబరాల్లో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 3 - 5 గంటల మధ్య అతిథుల పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్రిటోస్ లోని వసంత భవన్ యాజమాన్యం రుచికరమైన స్నాక్స్, అల్పాహారాన్ని సరఫరా చేసింది.
http://telugupeople.com/uploads/tphome/images/2009/cal1.gif' align='left' alt=''>
టాస్క్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, స్థానిక ప్రవాసాంధ్ర ప్రముఖులు ధర్మారెడ్డి గుమ్మడి, సుబ్బారావు మక్కం, ప్రసాద్ వేపా, చెంచయ్య బత్తల సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి దీపావళి సంబరాలను ప్రారంభించారు. దిశ అనే చిన్నారి గణపతి ప్రార్థన చేయడంతో దీపావళి సాంస్కృతిక టాలెంట్ షోను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని శ్యామ్ అప్పలి నిర్వహించారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళ చావా 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గేయాన్ని ఆలపించింది. అనంతరం దీపావళి పండుగ, దానికి ఉన్న పురాణ ప్రాశస్త్యం గురించి తాండవ కృష్ణమాచార్యులు సంక్షిప్తంగా వివరించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 'శివ స్తోత్రా'న్ని శ్రీకర్ రాణి పఠించారు. శ్రీమతి స్వాతి భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు. సుధ కొత్త, శ్రావ్య కొత్త సోదరీమణులు సినిమా గీతాలు ఆలపించారు. వీరిద్దరూ ఆలపించిన 'లవ కుశ' పాట అందరినీ అమితంగా ఆహ్లాదపరిచింది. సూపర్ హిట్ చిత్రాలైన మగధీర, మల్లన్న, కింగ్, ఆర్య చిత్రాల్లోని ఫాస్ట్ బీట్ పాటలకు చేసిన నృత్యాలకు అనుగుణంగా ఆహూతులు కూడా డాన్సులు చేయడం విశేషం. 'విజ్ కిడ్' షోను సాగర్ నిర్వహించారు. సాగర్ అడిగిన వందకు పైగా దేశాల రాజధానుల పేర్లను నాలుగేళ్ళ అబ్బాయి చకచకా సమాధానాలు చెప్పేసి అందరి మన్ననలూ పొందాడు. శాంతా బార్బరా నుంచి వచ్చిన సురేంద్ర దారా తన హాస్యరస కార్యక్రమంతో అతిథుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. క్విజ్ మాస్టర్ శ్రీనివాస్ రాణి తెలుగు సినిమాలు, సంగీతం, చరిత్ర అంశాలపై నిర్వహించిన ప్రత్యేక ఇంటరాక్టివ్ గేమ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
http://telugupeople.com/uploads/tphome/images/2009/cal2.gif' align='right' alt=''>
ఈ కార్యక్రమంలో చక్కని కార్యక్రమాలు ప్రదర్శించిన వారికి, పాల్గొన్నవారికి, హాజరైన వారికి, వరద బాధితుల సహాయని నిధికి విరాళాలు అందజేసినవారికి, దీపావళి సంబరాల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రాజ్ జ్యుయలర్స్, శ్రీనివాసరెడ్డి దంపతులకు, డాక్టర్ అర్జున్ దళవాయ్, వివిధ కమిటీల చైర్ పర్సన్లు, వలంటీర్లకు, సంస్థ మాజీ అధ్యక్షులు అనిల్ ఎర్రబెల్లి, మల్లిక్ బందా టాస్క్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి, భారతి పిన్నింటి, మురళి వెంకటరమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/cal3.gif' align='left' alt=''>
సంవత్సరం అంతా రకరకాల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న టాస్క్ సంస్థ కమిటీల చైర్ పర్సన్లు, వలంటీర్లు ప్రసాద్ రాణి, రాజు వేదాల, విజయ భాస్కర్, సీతారాం పమిరెడ్డి, శేఖర్ సీరా, పాషా షేక్, విశాల్ శ్రీవాస్తవ, సుజిత్ వాడి, వంశీ బోయినపల్లి, రాజా, మోనికారాణి, శ్రీనివాస్ రాణి, చక్రధర్ రెడ్డి, శ్యాం అప్పలిలను ఆహూతులు అభినందనలతో ముంచెత్తారు.
News Posted: 9 November, 2009
|