కన్సాస్ లో మగధీర హంగామా

న్యూయార్క్ : రామ్ చరణ్ తేజ నటించిన మగధీర శతదినోత్సవాన్ని కన్సాస్ నగరంలో నిర్వహిస్తున్నట్లు కోలీ టాలీ మూవీస్ సంస్థ తెలిపింది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చి అమెరికాలోని కన్సాస్ నగరంలోను చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి కోసం ఈ సంస్థ దక్షిణ భారతదేశ భాషా చిత్రాలను ప్రదర్శిస్తుంది. కన్సాస్ లో ప్రదర్శిస్తున్న మగధీర శతదినోత్సవం జరుపుకుంటూ మైలురాయిగా నిలిచిందని, వారాంతాల్లో 3, 4 షోలు కూడా ప్రదర్శిస్తున్నట్లు కోలీ టాలీ మూవీస్ సంస్థ వెల్లడించింది.

మగధీర శతదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని నవంబర్ 7 శనివారం ప్రత్యేకంగా ఉచితంగా ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశామని, దానికి 300 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారని కోలీ టాలీ మూవీస్ సంస్థ పేర్కొంది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించడంతో పెద్ద ఆడిటోరియంలో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మగధీర సెలబ్రేషన్లకు స్పాన్సర్ గా వ్యవహరించిన 'మసాలా' యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమాన్ని ప్రత్యేకంగా కవర్ చేసిన కె.సి. దేశి, సహాయ సహకారాలు అందించిన చిరు వారధి సంస్థకు, బ్లూ స్కై సినిమా యాజమాన్యానికి కోలీ టాలీ మూవీస్ సంస్థ కృతజ్ఞతలు చెప్పింది.
News Posted: 9 November, 2009
|