గల్ఫ్ ఎన్బీకే ఫాన్స్ విరాళం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో బాధితులకు చేయూతనిచ్చేందుకు గల్ఫ్ వైడ్ నందమూరి బాలకృష్ణ అభిమానం సంఘం ముందుకు వచ్చింది. జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని కువైట్ వెళ్ళి నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు వరద బాధితులకు సహాయంగా 55 వేల రూపాయల డిడిని ఎన్టీఆర్ ట్రస్టుకు అందజేశారు. ఈ డిడిని దివంగత ఎన్టీఆర్ వీరాభిమాని, శ్రీకాళహస్తీశ్వరాలయం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ పిఆర్ మోహన్ నవంబర్ 9న బాలకృష్ణను ఆయన నివాసంలో కలుసుకొని అందజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, కువైట్ లోని నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వితరణను అభినందించారు. అవకాశం వస్తే అక్కడి అభిమానులను, తెలుగువారిని కలుసుకునేందుకు తాను కువైట్ వెళతానని అన్నారు.
News Posted: 11 November, 2009
|