వంగూరి ఫౌండేషన్ ఆహ్వానం టెక్సాస్ : పద్నాలుగు సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, వచ్చే 'వికృతి' నామ సంవత్సర ఉగాది (2010 మార్చి 16) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 15వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తోంది. విదేశాలలో తెలుగు భాషను, సృజనాత్మక రచనలను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వస్తున్న ఈ పోటీలలో ఉత్తర అమెరికాలోనూ, మాతృభూమిని వదలి ఇతర దేశాలలో నివసిస్తున్న విదేశాంధ్ర రచయితలందరూ ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఫౌండేషన్ ఆహ్వానిస్తోంది. విజేతలకు ప్రశంసాపత్రాలతో పాటు నగదు పారితోషికాలను వంగూరి ఫౌండేషన్ అందజేస్తుంది.
ఉత్తమ కథానిక : (రెండు బహుమతులు) ఒక్కొక్కటి: $116. ఉత్తమ కవిత : (రెండు బహుమతులు) : ఒక్కొక్కటీ : $116. ఉత్తమ వ్యాసం : (రెండు బహుమతులు) : ఒక్కొక్కటి : $116. ఈ సంవత్సర ప్రత్యేకం 'నా మొట్ట మొదటి కథ'. కథ రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ కథలను ఎక్కడా ప్రచురించని సరికొత్త కథా రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా 'నా మొట్టమొదటి కథ' అనే ప్రక్రియ మొదలుపెడుతున్నట్లు వంగూరి ఫౌండేషన్ వెల్లడించింది. తమ సంస్థ పోటీకి పంపించే కథ మొట్టమొదటి అని పేర్కొంటూ, నూతన కథకులను కథలను పంపించమని సంస్థ కోరింది. వాటిని అన్నింటినీ తన న్యాయ నిర్ణేతలు పరిశీలించి, కనీసం రెండు కథలకు ఒక్కొక్కటీ $116 చొప్పున బహుమతి, ప్రశంసాపత్రం ఇచ్చి గుర్తిస్తుంది.
ఇవే కాక, అర్హత ఉన్న ఇతర కథలన్నింటినీ రాబోయే 'అమెరికా తెలుగు కథానిక - పదకొండవ సంకలనం'లో ప్రచురించనున్నట్లు వంగూరి ఫౌండేషన్ స్పష్టం చేసింది. తరాల తారతమ్యం లేకుండా, విదేశాలలో నివసించే నూతన కథకులందరినీ ఈ 'పోటీ' లో పాల్గొనమని ఆహ్వానించింది. 'నా మొట్టమొదటి కథ' శీర్షికతో కొత్త రచయితలు తమ కథను పంపించాలి. 'ఇదివరకూ ఎక్కడా నా కథలు ప్రచురించ లేదు' అని చెప్పే మీ మాటను మేము నమ్ముతాం. ఇది నిజానికి 'పోటీ' కాని టపోటీ'. అన్ని పోటీలకt ముఖ్య గమనికలు ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ మూడు ఎంట్రీలు పంపించవచ్చు. నవలకు పేజీల పరిమితి లేదు కానీ మిగిలినవన్నీ రాత ప్రతిలో పదిహేను పేజీల లోపు ఉంటే బావుంటుంది.
రచయితలు తమకు నచ్చిన ఇతివృత్తాన్ని ఎన్నుకోవచ్చు. విదేశాంధ్ర రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే వంగూరి ఫౌండేషన్ పరిశీలనకు స్వీకరిస్తుంది. సొంత బ్లాగులు, వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్నా పంపంచవచ్చు. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, 'రచన' మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలును బట్టి ప్రచురితమవుతాయి.
ఫలితాలను 2010 మే 15 తేదీ లోగా సంస్థ ప్రకటిస్తుంది. కాపీ రైట్స్ తమవే అయినా, ఈ లోగా తమ ఎంట్రీలను ఇంకెక్కడా ప్రచురించవద్దని రచయితలను వంగూరి ఫౌండేషన్ కోరింది.
విజేతల ఎన్నికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is : March 16, 2010 (Ugadi)
---------------------------------------------------------------
రెండవ ఆహ్వానం : 20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కవిత (మా రాబోయే ప్రచురణ -2010) 20వ శతాబ్దంలో, ఇంచుమించు 1960 ప్రాంతాల నుండీ ఉత్తర అమెరికా వలస వచ్చిన అనేక మంది, తమదే అయిన స్ఫూర్తితో, సృజనాత్మకతో, తెలుగులో ఎన్నెన్నో కవితలు రచించి, ఎంతో గొప్పదైన మన తెలుగు కవితను సుసంపన్నం చేశారు. అటు సుదీర్ఘమైన కావ్యాలతో పాటు, ఇటు ఆధునిక వచన కవితలు మొదలైన అనేక అనేక ప్రక్రియలలో రచించి ఉత్తర అమెరికాలో తెలుగు కవితకి పునాదులు వేశారు. ఆయా రచయితల కృషికి గుర్తింపుగా, మొదటి మూడు, నాలుగు తరాల అమెరికా కవుల కవితలో మంచి ప్రమాణాలతో వైవిధ్యం గల కవితలను తగినంత సంఖ్యలో ఎంపిక చేసి '20వ శతాబ్దంలో అమెరికా తెలుగు కవిత' పేరిట 2010వ సంవత్సరంలో ప్రచురించాలని వంగూరి ఫౌండేషన్ సంకల్పించింది. ఆయా కవితల సేకరణలో మీ సహాయ, సహకారాలు అందించాలని ఫౌండేషన్ అర్థించింది. 20వ శతాబ్దంలో మీరు రచించి, ప్రచురించిన కవితలలో మీకు నచ్చిన ఐదు కవితలను తమకు పంపించాలని కోరింది.
Pages: 1 -2- News Posted: 2 December, 2009
|