న్యూజెర్సీలో జై సమైక్యాంధ్ర న్యూజెర్సీ : సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా డిసెంబర్ 20 ఆదివారంనాడు న్యూజెర్సీలో 'జై సమైక్యాంధ్ర' సమావేశం నిర్వహిస్తున్నట్లు సత్య నేమన ఒక ప్రకటనలో తెలిపారు. న్యూజెర్సీలోని పిస్కాటవేలో ఉన్న రాడిసన్ హొటల్ లో ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి 'సమైక్యాంధ్రప్రదేశ్'కు మద్దతు ఇచ్చేవారందరూ, తమ మిత్రులు, బంధువులతో సహా హాజరుకావాలని ఆహ్వానం పలికారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురైనట్లు సత్య నేమన తన ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసువులు బాసిన విద్యార్థులు, సమైక్య వాదులకు ఈ సమావేశంలో నివాళులు అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటిస్తామన్నారు. ఉస్మానియా, కాకతీయ, శ్రీకృష్ణ దేవరాయ, శ్రీ వేంకటేశ్వర, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పోలీసుల దాష్టీకాన్ని తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
సమావేశం ఎజెండా :
- తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇటీవలి ఉద్యమాల సందర్భంగా అసువులు బాసిన విద్యార్థులు, ప్రజల మృతికి సంతాపం
- సమైక్యాంధ్ర కోసం ప్రతిజ్ఞ
- శాంతి, సారస్యాలు కాపాడాలని, ఉద్రేక పూరిత, హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలంటూ తెలుగువారందరికీ విజ్ఞప్తి చేయడం
ఈ సమావేశం ఎజెండాగా నిర్ణయించినట్లు సత్య నేమన తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన తెలుగువారంతా సమావేశంలో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాలని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సత్య నేమన ఆహ్వానించారు.
ఇతర వివరాలు తెలుసుకోవాలంటే : ప్రసాద్ కావూరు - 630 544 8233, శ్రీనివాస్ పెన్మెత్స - 732 619 3164, సాయి చోకురి - 609 356 4657, రామానాయుడు కంటుబుక్త - 732 662 0680, ప్రవీణ్ పెన్మెత్స - 646 288 1488, పొన్నాల జాన్ - 240 422 6359, ప్రసాద్ మన్నె - 347 465 1187, కిరణ్ పాటిబండ్ల - 919 244 8050 ఫోన్ నెంబర్లలో సంప్రతించవచ్చు.
News Posted: 19 December, 2009
|