చిన్నారులకు తానా టాయ్స్
డల్లాస్ : క్రిస్మస్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త అమెరికా (తానా) చిన్నారులకు బొమ్మలు, 'Toys R US' పేరిట గిఫ్ట్ సర్టిఫికెట్లను పంపిణీ చేసింది. ఇర్వింగ్ పోలీస్ శాఖ, అగ్నిమాపక దళం సిబ్బంది ద్వారా 60 కుటుంబాల్లోని చిన్నారులకు వీటిని ఈ నెల 22న అందజేశారు. క్రిస్మస్ రోజున చిన్నారులకు బొమ్మల పంపిణీ కార్యక్రమాన్ని 30 ఏళ్ళ క్రితం ప్రారంభించినప్పుడు కేవలం 25 కుటుంబాలే లబ్ధి పొందాయని ఇప్పుడు 400 కుటుంబాలకు పెరిగిందని ఇర్వింగ్ సిటీ పోలీస్ కమ్యూనిటీ సర్వీస్ విభాగానికి చెందిన అధికారి గ్రెగ్ స్పీవె పేర్కొన్నారు. అవసరంలో ఉన్న చిన్నారుల కోసం టాయ్స్ ను ఉదారంగా అందజేసిన తానాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన చిన్నారులను తాము ఎంపిక చేసి టాయ్స్ ను అందజేస్తామన్నారు. తానా లాంటి సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించకపోతే అభాగ్యులైన చిన్నారులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోలేరని గ్రెగ్ స్పీవె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చక్కని సమన్వయం అందించిన తానా మహిళా విభాగం చైర్ పర్సన్ మంజులత కన్నెగంటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'టాయ్స్ ఫర్ టాట్స్' కార్యక్రమానికి విరాళాలు అందజేసిన వారికి, సంపూర్ణ మద్దతు ఇచ్చిన టాన్ టెక్స్ సంస్థకు తానా ఎగ్జిక్యూటివ్ వైఎస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర అభినందనలు తెలిపారు. ఈ టాయ్స్ ఫర్ టాట్స్ కార్యక్రమం కోసం టాయ్స్ ను మంజు & రామ్ యలమంచిలి, మంజులత & చంద్ర కన్నగంటి, సీత & కుమార్ దగ్గుబాటి, సతీష్ గోగినేని, శిరీష & ప్రసాద్ నల్లపాటి, వినయ్ & మురళి వెన్నం, జ్యోతి & రాజేష్ వీరపనేని, స్వరూప & ప్రసాద్ తోటకూర అందజేశారు.
News Posted: 24 December, 2009
|