'గీత' సంక్రాంతి సంబరాలు
ఇండియానా పోలీస్ : గ్రేటర్ ఇండియానా పోలిస్ తెలుగు సంఘం (గీత) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రవాస తెలుగు వారితో పాటు ప్రవాస భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై సంబరాలలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ సందర్భంగా గీత ఆధ్యక్షులు అజయ్ పొనుగోటి మాట్లాడుతూ, యువత, విద్యార్థులు ఇలాంటి తెలుగు పండుగలకు విచ్చేసినందుకు అభినందనలు తెలియచేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ సభ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నవ్యవాణి ఎడిటర్ డిహెచ్ఆర్ శర్మ కొత్త సంచికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ క్రిష్ణమనేని, ఇతర బోర్డు సభ్యులు పాల్గొని ఇటీవల హైతీ భూకంప బాధితులకు విరాళాలను సేకరించారు.
ఈ కార్యక్రమాలను వినోద్ సాదు, రాము చింతల, సతీష్ గజ్జల పర్యవేక్షించారు. ఇతర కమిటీ సభ్యుల సహకారంతో అతిథులకు సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాలను వడ్డించారు.
News Posted: 20 January, 2010
|