బోస్టన్,న్యూజెర్సీ లోధూంధాం న్యూజెర్సీ : తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ధూంధాం నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రతీ ఏటా న్యూజెర్సీ, బోస్టన్ నగరాల్లో నిర్వహించే ఈ వేడుకలను ఫిబ్రవరి 6 వ తేదీన బోస్టన్, 7 తేదీన న్యూజెర్సీలో నిర్వహిస్తున్నారు. బోస్టన్ లోని కీఫీ టెక్నికల్ స్కూల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరగనున్నాయి. 6న జరిగే వేడుకలలో తెలంగాణ సాంస్కృతిక కళా ప్రదర్శనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ధూంధాంలో తెలంగాణ జానపద గేయాలు, కళారూపాలు, నృత్యాల ప్రదర్శించనున్నారు. అలాగే 'మాభూమి' సంధ్య ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఫిబ్రవరి 6 తేదీ న బోస్టన్ లో కీఫీ టెక్నికల్ స్కూల్ ఆడిటొరియం లో సాయంత్రం 4 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. బోస్టన్ తెలంగాణా ధూం ధాం వివరాలకు, 508-904-4104 లేదా events@telanagananri.com సంప్రదించాలని, ఫిబ్రవరి 7 తేదీ న న్యూ జర్సీ లో శ్రీ స్వామి నారాయణ టెంపల్ సామర్సెట్ లో 12 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. న్యూ జర్సీతెలంగాణా ధూం ధాం వివరాలకు, 215-915-0247 లేదా tena.newjersey@gmail.com సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
News Posted: 26 January, 2010
|