30న టిసిఎ సంక్రాంతి టెక్సాస్ : ఆస్టిన్ టెక్సాస్ లో ఈ నెల 30న సంక్రాంతి సంబరాలు, సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు టిసిఎ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్టిన్ లోని నార్త్ హిల్స్ డ్రైవ్ లో ఉన్న మర్చిసన్ మిడిల్ స్కూల్ లో ఆ రోజు సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపింది. సంక్రాంతి సంబరాలను పూర్తి వినోదాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టిసిఎ కమిటీ పేర్కొంది.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా 'బాలీవుడ్ షేక్' నృత్య ప్రదర్శన బృందం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు టిసిఎ కమిటీ తెలిపింది. దీనితో పాటు ఫ్లోరిడాకు చెందిన పిఎంజె జుయలరీస్ సంస్థ 'గోల్డ్ - డైమండ్' ఆభరణాల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాల అనంతరం టిసిఎ కమిటీ వార్షిక సర్వ సభ్య సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా 2009 సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలపైన, వార్షిక ఆర్థిక నివేదికలు సమర్పించాలని నిర్ణయించింది. చివరిగా 2010వ సంవత్సరానికి సంబంధించి టిసిఎ నూతన కార్యనిర్వాహకవర్గం ఎన్నిక నిర్వహించనున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులకు టీ, స్నాక్స్ అందజేయనున్నట్లు కమిటీ తెలిపింది. సంక్రాంతి సంబరాలకు, సమావేశానికి, కొత్త కమిటీ ఎన్నికల కార్యక్రమానికి సభ్యులంతా హాజరు కావాలని టిసిఎ కమిటీ ఆహ్వానించింది.
News Posted: 27 January, 2010
|