తిరుపతి : తిరుపితిలోని శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో ధ్వజారోహణ ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్యజస్తంభానికి పసుపురంగు జెండాను కట్టి ఆవిష్కరణ చేయడంతో ధ్వజారోహణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేసారు.
అలాగే కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఆలయంలోని నంది వద్ద ధ్వజస్తంభాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వేద మంత్రాలతో ప్రతిధ్వనించింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ధ్వజారోహణను జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థాస ఆధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.