హరికిషన్ కు అకాడమి అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2010/HariKishan_Ad.jpg' align='right' alt=''>అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సంఘ సేవకుడు, ప్రవాసాంధ్రుడు హరి కిషన్ ఎప్పనపల్లి ప్రతిష్ఠాత్మక ఢిల్లీ తెలుగు అకాడమీ (న్యూఢిల్లీ) ఎక్స్ లెన్స్ అవార్డ్ / విశాల్ భారత్ గౌరవ్ సత్కార్-2010కు ఎంపికయ్యారు. పారిశ్రామికరంగంలో అసమాన ప్రతిభతో పాటు ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేయనున్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ 22వ ఉగాది సెలబ్రేషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈనెల 21న జరుగనున్న కార్యక్రమంలో 'విశాల్ భరత్ గౌరవ్ సత్కార్'ను హరికిషన్ అందుకుంటారు.
సమాజానికి నిస్వార్థ సేవలు అందించే సంస్థలు, వ్యక్తులకు చేయూత నిచ్చేందుకు హరికృష్ణ ఎప్పనపల్లి 2008లో 'ది ఎప్పనపల్లి ఛారిటబుల్ ట్రస్ట్' (ఐసిఎఫ్) ను స్థాపించారు. ఈ ట్రస్టు ఫౌండర్ అండ్ చైర్మన్ గా ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కరీనంగర్ జిల్లా చొప్పదండిలో నవదోయ స్కూల్ ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్కూలుగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం అందించారు. జిన్న జీయర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులను ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. పారిశ్రామిక వేత్తగా అసమాన ప్రతిభాపాటవాలు చాటుకుంటూ అమెరికాలో 'కాన్సెప్ట్ ఇన్ కంప్యూటింగ్ ఇన్ కార్పొరేషన్' చైర్మన్ అండ్ సిఇవో గా వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాల్లో కనబరుస్తున్న ప్రతిభ, సేవా కార్యక్రమాలకు ఆయన భార్య డాక్టర్ శాంతి శ్రీ, కుమార్తె పూజ జ్యోతి, కుమారుడు వంశీకృష్ణ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. కాగా, లలిత కళలు, పేదప్రజల అభ్యున్నతి కోసం స్వచ్ఛంద సంస్థగా 1990లో ఢిల్లీ తెలుగు అకాడమీ (డిటిఎ) ఏర్పాటైంది. అడ్రినిస్ట్రేషన్, శాస్త్ర, సాంకేతక, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని గౌరవించేందుకు డిటిఎ అవార్డులను ఏర్పాటు చేసి ఇంతవరకూ 1100 మందికి పైగా ప్రముఖులను సత్కరించింది. ఈ ఏడాది 'విశాల్ భారత్ గౌరవ్ సత్కార్' అవార్డుకు హరికిషన్ ను జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
News Posted: 19 March, 2010
|