సచినే చూపిన దారిలోనే... సెంచూరియన్: ప్రపంచ క్రికెట్ లో ఎదురులేని శక్తిగా మారిన భా రత స్టార్ సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితోనే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సెంచరీ సాధించగలిగానని ఆస్ట్రేలి యా కెప్టెన్ రికీపాంటింగ్ వ్యాఖ్యానించాడు. సమాకాలిన క్రికెట్‌లో సచిన్‌ను మించిన ఆటగాడు లేడన్నా డు. 20 ఏళ్లపాటు సుదీర్ఘ క్రికెట్ ఆడి సచిన్ తనలాంటి ఎంద రో క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడన్నాడు. టెస్టులు, వన్డేల్లో అతని రికార్డులను అందుకోవడం సమీప భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదని పాంటింగ్ స్పష్టం చేశాడు. వన్డేల్లో 12వేల పరుగులను పూర్తి చేయడం ఆనందంగా, ఉందని అయితే అత్యధిక పరుగుల సచిన్ రికార్డును అధిగమించడం దాదాపు అసాధ్యమేనని పాంటింగ్ అన్నాడు.
News Posted: 4 October, 2009
|