ఉప్పల్ వన్డేకు గంభీర్ ఫిట్ హైదరాబాద్ : భారత్ - ఆసీస్ జట్ల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం జరగననున్న ఐదో వన్డేలో ఆడేందుకు గౌతం గంభీర్ ఫిట్ అయ్యాడు. మెడ నొప్పి వల్ల గంభీర్ మొహాలీలో సోమవారం జరిగిన నాలుగో వన్డేలో ఆడలేదు. కాగా, మరో ఏడు పరుగులు చేయడం ద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వన్డేల్లో 17 వేల పరుగుల మైలురాయి దాటి మరే క్రికెటర్ చేయని రికార్డు సాధిస్తాడన్న ధీమాను టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యక్తం చేశాడు. ఉప్పల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేసిన సందర్భంగా ధోనీ బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడాడు. తమ జట్టులోని బౌలర్లు చక్కగా రాణిస్తున్నారని ధోనీ చెప్పాడు. మొహాలీ వన్డేలో అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోనూ విఫలమైనందువల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని ధోనీ విశ్లేషించాడు.
కాగా, ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాలు పట్టేయడంతో మోజెస్ హెన్రిక్స్ హైదరాబాద్ లో గురువారం జరగనున్న ఐదో వన్డేలో ఆడడం లేదు.
News Posted: 4 November, 2009
|