`తానా'వారె పరులైన వోట్లెందుకు..?
ఏవైనా వివాదాలుంటే స్వతంత్ర బృందంతో విచారణ జరిపించి పరిష్కారం చేయాలని, ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం ఉన్నవారిని ఇలాంటి ప్రక్రియకు దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు, పిల్లలను సభ్యులుగా చేర్పించాలనుకున్న వాళ్లను, దరఖాస్తు చేసిన తర్వాత చిరునామా మారిన వాళ్లను అనుమానించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ ధోరణితో కొత్త సభ్యులు ఆవేదనకు గురయ్యారని, అందుకే తానా నాయకత్వం అడిగిన అదనపు వివరాలను సమర్పించేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలో ఉండడంకన్నా దురంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయం తెలుగువారిలో కలిగేలా నాయకత్వం వ్యవహరించిందని వారు భావిస్తున్నారు. దరఖాస్తులతో పాటు కొత్త సభ్యులు చెల్లించిన రుసుమును ఖాతాలో వేసుకొని, వాడుకుంటూ ఏడాది గడచిన తర్వాత ఇప్పుడు కొత్తగా ధ్రువీకరణ పత్రాలు అడగడం ఎక్కడి న్యాయమని నిలదీశారు.
తెలుగువారి విశ్వాసాన్ని కోల్పోవడం ద్వారా తానా నాయకులు సంస్థ ప్రతిష్ఠను మంటగలిపారని 103 మంది సభ్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. సభ్యుల ప్రయోజనాలను కాపాడాలన్న మౌలిక బాధ్యతను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అధీకృత సభ్యుల జాబితా తయారు కాకుండానే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ముగించడాన్ని వారు తప్పుబట్టారు. పెద్ద సంఖ్యలో సభ్యులను దూరంగా పెట్టి ఎన్నికలను నిర్వహించాలనుకోవడాన్ని పెద్ద జోక్ గా అభివర్ణించారు. ప్రవాస భారతీయులు ఇప్పుడు తానా వ్యవహారాలను చూసి నవ్వుకుంటున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ రకంగా తానా అమెరికా తెలుగువారికి ఏ విధంగానూ కొరగాకుండా పోయిందని, ఇన్నేళ్లు తాము అనుబంధం పెంచుకున్న సంస్థ ఇలా దిగజారిపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి అర్థరహితంగా తయారైన తానా ఎన్నికల్లో తామెవరమూ పోటీ చేయబోమని వారు ప్రకటించారు. ఈ ప్రకటనపై మల్లికార్జున రావు చలసాని, రణకుమార్ నాదెళ్ల, వీరయ్య చుండు, మధు కొర్రపాటి, బాబూరావు దొడ్డపనేని, కృష్ణ పోలవరపు, యుగంధర రావు వల్లభనేని, హరనాథ్ దొడ్డపనేని, సతీశ్ దాసరి తదితర 103 మంది సంతకాలు చేశారు.
Pages: -1- -2- 3 News Posted: 25 February, 2009
|