`తానా'వారె పరులైన వోట్లెందుకు..?
కోర్టు కేసులను కూడా నాయకులు ఎన్నికల ప్రయోజనాల కోసం రాజీ చేయించారు. ఈ నేపధ్యంలో సంస్థపై అభిమానం ఉన్న సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయకూడదని, పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. తమ బంధు మిత్రులు కూడా ఎన్నికలకు దూరం ఉంటారని ప్రకటించారు. అంటే... ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చారన్నమాట..! ఇంత కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు వీరిని పురికొల్పిన కారణాలు సహేతుకంగానే ఉన్నాయి. ఈ ఏడాది జూలైలో జరగవలసిన తానా ద్వైవార్షిక సదస్సు వేదికను ఓర్లాండో నుంచి షికాగోకు మార్చడం వల్ల ఓర్లాండో కన్వెన్షన్ సెంటర్ కు 1,75,000 డాలర్లు పెనాల్టీగా చెల్లించవలసి వచ్చింది. ఓర్లాండో వేదికను వ్యతిరేకించినవారు, కావాలన్నవారు ఇప్పుడు కలిసిపోయి సదస్సును షికాగోలో నిర్వహించాలని నిర్ణయించి, రాజీ పడడం ద్వారా ఘనకార్యం చేశామన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. మరి ఓర్లాండో పెనాల్టీ డబ్బు సంస్థకు ఎవరిస్తారు..? సభ్యులు ఒక్కొక్క డాలరూ పోగుచేసుకొని ఇచ్చిన సొమ్మును తమ ఇష్టానుసారం ఉపయోగించడమే కాకుండా భారీగా దుబారా చేసిన నాయకులు ఈ ఖర్చును భరిస్తారా? లేదు! మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి, గెలిచి నిధులతో ఆటాడుకుంటారు. అందుకే, ఇలాంటి నాయకుల అక్రమాలకు చేయూతనివ్వకూడదనే ఉద్దేశంతో సంస్థ సభ్యులు ఎన్నికల బహిష్కరణకు నిర్ణయించుకున్నారు.
తానా నాయకత్వం సభ్యుల విశ్వాసాన్ని కోల్పోయిందని వారు తమ సంస్థ కార్యనిర్వాహక వర్గానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలుగువారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన వేదికగా తానాపై అభిమానంతో పది వేల మంది కొత్తగా సభ్యులుగా చేరితే, సభ్యత్వ తనిఖీల పేరిట వారిని ఓటుహక్కుకు దూరం చేశారని ఆక్షేపించారు. పాలకమండలిలో పలుకుబడి కలిగిన కొందరు నేతలకు ప్రయోజనం కలిగించేలా సభ్యత్వ వివరాలను, ఆన్ లైన్ నమోదు ప్రక్రియను భ్రష్టు పట్టించారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఓటర్ల నమోదు సందర్భంగా అడిగిన అన్ని ఆధారాలనూ సమర్పించి, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటుహక్కు ఇవ్వకపోవడం తానా పాలకమండలి నిరంకుశత్వానికి తార్కాణమని పేర్కొన్నారు. అమలులో ఉన్న తానా నియమావళిని, సంప్రదాయాలను పక్కనపెట్టి, తర్వాత తమకు తోచిన నిబంధనలను చేర్చడం ద్వారా కొత్త సభ్యత్వ దరఖాస్తులను పక్కన పెట్టడం శోచనీయమని అన్నారు.
Pages: -1- 2 -3- News Posted: 25 February, 2009
|