షికాగో తెలుగు సంఘం ఏర్పాటు
అతిథిగా విచ్చేసిన షికాగో మానవ సంబంధాల సలహా సంఘం కమ్యూనిటీ లైజన్ డైరెక్టర్ క్రిపాల్ ఝలా సిటిఏ వెబ్ సైట్ (www.chicagoteluguassociaton.org)ను, హెల్ప్ లైన్ ను ప్రారంభించారు. ఈ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందించాలనుకునే తెలుగువారికి పూర్తిగా టోల్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. సిటిఏ సంస్థకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా క్రిపాల్ ఝాలా హామీ ఇచ్చారు. డెన్వర్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రసిద్ధ దాత శ్రీధర్ తాలంకి మాట్లాడుతూ, డెన్వర్ లో తెలుగు వారి అనుభవాల గురించి వివరించారు.
సమాజం సరికొత్త మార్గంలో పయనించేందుకు నాయకత్వంలో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని షికాగో తెలుగు అసోసియేషన్ సహ వ్యవస్థాపకులు ఫణి రామినేని, కృష్ణ అడుసుమల్లి, తళ్ళూరు ప్రసాద్, శివ చౌదరి, వేణు కోడూరు, రమేశ్ మర్యాల పేర్కొన్నారు. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రవాసాంధ్రుడు రాజ్ కావూరి ఈ సమావేశానికి హాజరై సంస్థ నిర్వాహకులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. సంస్థ నిర్వహించే సాధారణ కార్యక్రమాలతో పాటు చిన్నపిల్లలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారించాలని ప్రముఖ ప్రవాసాంధ్రురాలు శ్రీమతి విజయ కొండూరు సూచించారు.
సిటిఏ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీనివాస్ గనమని, చుండు శ్రీనివాస్, మనోహర్ వేదాంతం, ప్రవీణ్ రెడ్డి భూమన, విజయ్ వెనిగళ్ళ, విజయ్ గన్నె, ప్రదీప్ పావులూరు, మూర్తి కొప్పాక, సుబ్బారావు పోతిన, సుబ్బారావు ఐనంపూడి, రత్న గారపాటి, సాయి గవిర్నేని, సాయి యండమూరి, శిరీష గుత్తా, సత్య దొడ్డపనేని, రమేష్ ఆకుల, శివ యర్రంశెట్టి, శ్రీ యర్రంశెట్టి, రాజ్ కందుల, కృష్ణ ప్రసాద్, నరేష్ చెరుకు, నిరంజన్, కృష్ణ కాజ తదితర స్థానికంగా పేరున్న యువకులు అవిశ్రాంతంగా కృషి చేశారు. సలిల దంతుర్తి సభకు స్వాగతం పలికారు.
Pages: -1- 2 -3- News Posted: 6 March, 2009
|