షికాగో తెలుగు సంఘం ఏర్పాటు
కార్యక్రమం విజయవంతం కావడంతో షికాగో తెలుగు అసోసియేషన్ ముఖ్యనిర్వాహకులలో ఒకరైన గోపి ఆచంట హర్షం వ్యక్తం చేశారు. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం కృషి చేసేందుకు ముందుకు వచ్చిన సిటిఏకు చేయూతనిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇతర ప్రసిద్ధ సంస్థలు హామీ ఇచ్చాయని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయంవంతం కావడంలో సేవలు అందించిన రమేష్ మర్యాల, ప్రవీణ్ కొయ్యలముడి, చైతన్య, సాయి చైతన్య, సందీప్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. షికాగో అమెరికా అసోసియేషన్ కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి పురందేశ్వరి, లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్, లోక్ సభ సభ్యుడు డి. విఠల్ రావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాద్ తదితరులు వీడియో ద్వారా అభినందనలు తెలిపారు.
సిటిఏ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమెరికాలోని 15 రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు. సిటిఏ సేవల విషయంలో ఎలాంటి సహాయం, సమాచారమైననా పొందగోరే తెలుగువారు ఇకపై సిటిఏ టోల్ ఫ్రీ నెంబర్ 1 888 OUR CTA 1లో సంప్రతించవచ్చు.
Pages: -1- -2- 3 News Posted: 6 March, 2009
|