వందడుగుల్లో ఆరోగ్యం
న్యూఢిల్లీ: నడకతో దేహ బాధలు దూరమవడమే కాదు, దగ్గరకు కూడా రాలేవని వైద్యులు సూచిస్తున్నారు. నిమిషానికి వంద అడుగుల చొప్పున వేగంగా నడిచే నడక శరీరంలోని అదనపు శక్తిని మండించడమే కాదు, మధుమేహం లేదా గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించవచ్చని ఒక అధ్యయనం తెలిపింది. 30 నిమిషాల సేపు చేసే ఒక మోస్తరు తీవ్రత గల వ్యాయామం పెడోమీటరులో 3 వేల అడుగులతో సమానమని అమెరికా సాండియాగో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకలు తెలియజేస్తున్నారు.
ఊబకాయం రాకుండా ఉండేందుకు, రక్తపోటును నియంత్రించేందుకు, గుండె జబ్బులను నివారించేందుకు వారానికి కనీసం అయిదు రోజుల పాటు రోజుకు 30 నిమిషాల సేపు ఒక మోస్తరు తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆ విశ్వవిద్యాలయంలోని వ్యాయామం, పోషక శాస్త్ర శాఖకు చెందిన సిమన్ మార్షల్ అతని పరిశోధక బృందం 58 మంది పురుషులపై, 39 మంది స్త్రీలపై ఈ అధ్యయనాన్ని చేపట్టారు. నిమిషానికి 91-115 అడుగుల నడకతో ఆడవాళ్లలో ఒకమోస్తరు తీవ్రత గల వ్యాయామ ప్రభావాన్ని సాధించగల్గితే, అదే మగవారిలో 92-102 అడుగుల్లోనే సాధించగల్గారని ఆ అద్యయనం పేర్కొంది. అమెరికన్ జర్నల్ ఆప్ ప్రివెంటివ్ మెడిసన్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|