వందడుగుల్లో ఆరోగ్యం
ప్రతిరోజు వ్యాయామం చేసేవారందరిలో చాలా మందికి అవరమైన మోతాదులో చేస్తే వచ్చే లాభాలు రావడం లేదు. వారు అవసరమైన స్థాయిలో వ్యాయామం చేయక పోవడం వలన ఇలా జరుగుతోంది. ఒకమోస్తరు తీవ్రతతో కూడిన వ్యాయామం చేయడం వల్ల మాత్రమే గుండె కొట్టుకునే రేటు అవసరమైన మోతాదులో ఉంటుంది. గరిష్ట గుండె రేటు ఆయా వ్యక్తుల వయసును 220 నుండి తీసి వేయడం ద్వారా గణించవచ్చు. 40 ఏళ్ల వ్యక్తి గుండె రేటు 180 గా అంచనా వేస్తారు. గుండె నిమిషానికి 108 సార్లు కొట్టుకునేంత తీవ్రతతో వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఆ మోతాదు వరకు వ్యాయామం చేస్తేనే అతని శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.
సగటు మగవాళ్లు ఆడవాళ్లకంటే పొడవుగా ఉంటారు కాబట్టి 30 నిమిషాల్లో వారు ఆడవాళ్ల కంటే తక్కువ అడుగులు వేయగలరు. అడుగుల లెక్క చాల సులభంగా ఉంటుంది. అయితే నిమిషానికి వందడుగుల లక్ష్యం అందరికి వర్తించదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.40 ఏళ్ల పైబడి పలు రకాల రుగ్మతలున్నవారు డాక్టర్ల సలహా మేరకు నడక వ్యాయామాన్ని చేపట్టవలసి ఉంటుంది. ఆరోగ్యవంతులైన వ్యక్తులు 30 నిమిషాల్లో 3 వేల అడుగులు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ అధ్యయనం తెలిపింది. అయితే ఈ నడక వేగాన్ని కేసారి ప్రయత్నించకూడదని డాక్టర్లు చెబుతున్నారు.
10 నిమిషాలకు ఒక వెయ్యి అడుగుల నడక నుండి ప్రారంభించి క్రమంగా 30 నిమిషాల్లో 3 వేల అడుగుల నడకకు చేరుకోవాలి. కేలరీల శక్తిని ఖర్చు చేయడం వ్యాయామం తీవ్రత, శారీరక బరువు, అందుకు తగిన కండరాల పరిమాణం, వయసు, జండర్ లపై ఆధారపడి ఉంటుంది. అయితే గంటకు ఒక కెజికి 3 కిలో కేలరీల శక్తిని ఖర్చు చేయడమనేది ప్రామాణికంగా నిలుస్తుంది. 70 కెజిల వ్యక్తి 30 నిమిషాల నడకలో 105 కిలో కేలరీల శక్తిని ఖర్చు చేయవలసి వస్తుందని ఆ అధ్యయనం తెలిపింది.
Pages: -1- 2 News Posted: 18 March, 2009
|