విలాసాలకు వీడ్కోలు
ఉద్యోగాన్ని కోల్పోవడంతో ఆయా వ్యక్తుల జీవితం దుర్భరంగా మారుతుంది. బాగా ప్రేమించే వ్యక్తిని కోల్పోవడం లేదా వారికి దూరమవడంతో సమానమైన మానసిక క్షోభ కలుగుతుందని మానసిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన యువతలో చాలా మంది మానసిక శాస్త్రవేత్తలను సందర్శిస్తున్నారు. ఉద్యోగం కోల్పోవడంతో వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి నిర్వీర్యులవుతున్నారు. నిద్రలేని రాత్రులు, పీడకలల రాత్రులను గడుపుతున్నారు. ప్రారంభంలో వారు శారీరక రుగ్మతల్ని మాత్రమే డాక్టర్లకు చెప్పినప్పటికీ, ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పలువురి మానసిక పరిస్థితిని డాక్టర్లు సులభంగా అంచనా వేయగల్గుతున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి ఇప్పటివరకు అలవాటైన విలాసవంతమైన జీవన శైలిని కొనసాగించలేక, రుణ వాయిదాలను చెల్లించలేక సతమతమై, నిద్రలేని రాత్రులను గడుపుతున్నాడు. ఉద్యోగం కోల్పోవడంతో అంతవరకు స్నేహితులు, బంధువుల్లో మంచి పేరు తెచ్చుకున్న సదరు వ్యక్తులు వారి సానుభూతి చూపులను ఎదుర్కోలేక పోతున్నారు. ఉద్యోగం పురుష లక్షణంగా భావించే మానసిక స్థితిలో ఉన్న బారత దేశంలో ఉద్యోగం పోవడమంటే అసమర్ధతకు తార్కాణంగా, హినమైన విషయంగా తలుస్తారు. ఈ పరిస్థితి ఉద్యోగాలు కోల్పోయిన వారిలో మరింత న్యూనతా భావాన్ని రెచ్చకొడుతుంది. ఐటి ఉద్యోగస్తులకు పిల్లనిచ్చేవారు కూడా కరువైన పరిస్థితి ఎదురైంది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి వివాహ అకాశాలు కూడా బాగా సన్నగిల్లాయని పలువురు వాపోతున్నారు.
జాబ్ మార్కెట్లలో వెతుకులాట బాగా పెరిగి పోయింది.కంపెనీ బాస్ లు దాదాపు కొద్ది నెలల ముందు నుండే ఉద్యోగాలు వెతుక్కోవలసిందిగా ఉద్యోగులకు రేఖామాత్రంగా సూచిస్తున్నారు. ఉపాధి కల్పన కేంద్రాల అడ్రసులను, ఫోన్ నెంబర్లను సైతం కంపెనీ బాస్ లు తమ సిబ్బందికి అందజేస్తున్నారు. కంపెనీ ఏదో ఒకనాడు బోర్డు తిప్పేస్తుందని బాస్ లు సూచించడమే కాకుండా వారు కూడా తీరిక లేకుండా తమ రెస్యూమ్ లను ఆన్ లైన్ లో పంపుతున్నారు. అదే సమయంలో ఏదైనా కంపెనీ ఇంటర్వయూ కోసం పిలిచి మనల్ని ఎంపిక చేసినప్పటికీ నియామకం చేస్తుందన్న గ్యారంటీ లేదు. గత ఏడాది 10 మార్కులకు నాలుగు మార్కులు సాధించినా ఉద్యోగం వచ్చే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 10 మార్కులకు 11 మార్కులు సాధించినా ఉద్యోగం చేసే గ్యారంటీ లేదు.
Pages: -1- 2 -3- News Posted: 19 March, 2009
|