విలాసాలకు వీడ్కోలు
ఉద్యోగ నియామకాల నిబంధనలు మారాయి. ఇది యాజమాన్య ఆదారిత మార్కెట్. 2002లో ఐటి రంగం మందగించినప్పటికీ మిగిలిన రంగాలు సజావుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఎగుమతుల రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఆవిరవతున్నాయి. ఐటి రంగంలో వేలాది ఉద్యోగాలు ఆవిరవుతున్నాయి. గత ఏడాది ఎగుమతుల రంగంలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్ ల సమయంలో ఏబిసి వైఖరిని అవలంభించాలని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏ-సమస్య పట్ల అవగాహన కల్పించడం, బి-గుణదోషాలను అంచనా వేసుకోగల్గడం, సి-ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం అనే వ్యూహాన్ని యాజమాన్యాలు చేపట్టాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఆచరించి విజయం సాధించడం కంటే ఇతరులకు సలహాలివ్వడం చాలా తేలిక. మనం చేయగల్గిన దానికంటే, చేసిన దానికంటే మన శక్తి సామర్ధ్యాలను ఎక్కువగా ఊహించుకునే సమాజంలో మనం బతుకుతున్నాము. అలాంటి సామాజిక నేపథ్యంలో ఉద్యోగులు కోల్పోయిన వారు దిగులు, విచారానికి గురికావడం సహజం. ఉద్యోగం చేస్తున్నప్పుడు సమర్ధతపై వచ్చిన వ్యాఖ్యానాలను ఉద్యోగం కోల్పోయిన సమయంలో సహజంగా గుర్తుకు వస్తుంటాయి. మాంద్యం పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించేందుకు అనర్హత సాకు చాలా చక్కగా ఉపకరిస్తుంది.
ఉద్యోగం కోల్పోయిన బాధను ఒకవైపు భరిస్తూనే మరో వైపు స్నేహితులు, బంధువుల సానుభూతి ఫోన్ కాల్స్ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతివాడు ఇలా చెయ్, అలా చెయ్ అని సలహాలతో వేధిస్తారు. సానుభూతి కంటే చావు మేలని ఒక్కొక్కసారి అనిపిస్తుండడం ఇందుకే. ఉద్యోగం పోయిన బాధ కంటే ఆ విషయాన్ని పదే పదే గుర్తు చేసే బంధు మిత్రుల సానుభూతిని భరించడం మరింత నరకంగా ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన ఈ కాలంలో తమ జీవితాల పట్ల సవ్యమైన దృక్ఫథం ఏర్పరచుకుని ఆ వైపు కృషి చేసేందుకు ఈ కాలాన్ని వినియోగించుకోవలసి ఉంటుంది. పలు నైపుణ్యాలను, అవసరమైన ఇతర భాషలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంతో మరో విడత ఉద్యోగ పర్వం ప్రారంమయ్యే నాటికి సుశిక్షితులుగా రంగంలోకి దిగేందుకు అవకాశముంటుంది. పింక్ స్లిప్ తో దిగాలుపడి, నిర్వీర్యులు కాకూడదు. తర్వాత కార్యాచరణపై కేంద్రీకరించాలి, ఆ తర్వాత వచ్చే జాబ్ బూమ్ ని మరింత శక్తివంతంగా వినియోగించుకునేందుకు తగిన శక్తిసామర్ధ్యాలను సాధించడంపై సమయాన్నిసద్వినియోగం చేసుకోవాలి.
Pages: -1- -2- 3 News Posted: 19 March, 2009
|