టిడిపి మేనిఫెస్టో ఇదీ
టిడిపి మేనిఫెస్టోలోని ప్రధానాంశాలివీ :
- ప్రతి మండలంలో ఇ సేవా కేంద్రాల మాదిరిగి సిటిజన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు
- అందరికీ ఆరోగ్య భద్రత
- టిడిపి అధికారంలోకి వస్తే రుణాల మాఫీ
- వ్యవసాయానికి పగటిపూట 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా సరఫరా
- వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్
- అన్ని పెన్షన్లూ 500 కు పెంపు
- నిరుద్యోగులకు 1000 రూపాయల భృతి
- రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టివీ ఉన్నవారి ఇంటి అవసరానికి ఉచితంగా విద్యుత్ సరఫరా
- యువతకు ఉద్యోగావకాశాలు
- ప్రతి మండలానికీ ఒక మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్
- మహిళా సాధికారతలో భాగంగా దీపం పథకం పునరుద్ధరణ
- ఉచితంగా సిలిండర్, 150 రూపాయలకే గ్యాస్ సరఫరా
- గిరిజన హక్కుల పరిరక్షణ
- చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు
- మగ్గాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా
- పేదలందరికీ కలర్ టీవి
- ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు
- పేదలందరికీ 15 లీటర్ల కిరోసిన్
- రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి
- ఐటి రంగానికి ప్రాధాన్యత
- వృత్తి పనివారికి చేయూతనిచ్చేందుకు ఆదరణ పథకం పునరుద్ధరణ
- రైతులకు ఉచిత బీమా సౌకర్యం
- రైతులకు వ్యక్తిగత గుర్తింపుకార్డులు
- కేబుల్ ఆపరేటర్లకు రాయితీలు
- ఆర్థికంగా వెనుకబడిన వారికి వివాహం సందర్భంగా బంగారు మంగళసూత్రం బహూకరణ
- మద్యం, బెల్ట్ షాపుల రద్దు
- హైస్కూల్ విద్య వరకూ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్ళ పంపిణీ
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాభివృద్ధి అథారిటీ ఏర్పాటు
- మాఫీ కాని రైతులకు రుణాల మాఫీ
- వ్యవసాయ పరికరాలపై 75 శాతం సబ్సిడీ
- వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఖర్చుల్లో 50 శాతం రాయితీ
- సన్న, చిన్నకారు రైతులకు 25 వేల వరకూ వడ్డీ లేని రుణం
- గీత కార్మికుల కోసం 720 జిఓ రద్దు
- బీసీల సంక్షేమానికి 3 వేల కోట్లతో నిధి ఏర్పాటు
- విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు
- 1250 ఆధునిక కారిడార్ల ఏర్పాటు
- పది వేల కోట్లతో ఉపాది కల్పన
- ఐదేళ్ళలో 10 లక్షల మందికి ఉపాధి
- రైతు సంక్షేమ నిధికి 500 కోట్లతో నిధి
- వికలాంగుల కోసం ప్రత్యేక కమిషన్
- దళిత క్రిస్టియన్లకు ఎస్సీలుగా గుర్తింపు
- ఆటోల కొనుగోలుపై 10 శాతం రాయితీ
- డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ సులభతరం
- జర్నలిస్టులందరికీ వారు పనిచేసే చోటే ఇళ్ళు కట్టించి ఇస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
Pages: -1- 2 News Posted: 2 April, 2009
|