`తానా'కు విరివిగా విరాళాలు
అధ్యక్షులు కాకరాల ప్రభాకర చౌదరి గారు తానా సంస్థ కేవలం మన సంస్కృతీ కళలను ప్రోత్సహించటమే కాకుండా సంఘసేవా కార్యక్రమాలను కూడ చేపట్టాలన్నారు. అప్పుడే తానాకు సమాజంలో నిజమైన గుర్తింపు లభిస్తుందని నమ్ముతున్నామన్నారు. 1977లో ప్రారంభమైన మన తానా సంస్థ సభ్యులు ఆదినుండీ ఉదారంగా ఇచ్చిన కోట్ల డాలర్ల విరాళాలు తానా చేపట్టిన అనేక ప్రజా సేవా పథకాలకు విరివిగా తోడ్పడ్డాయని తెలియజేశారు. తానా ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో విజయవంతంగా నిర్వహించిన ఆరొగ్య విద్య వైద్య కనీస సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు బహుళ ప్రజాదరణ పొందాయన్నారు. స్వచ్చందంగా నిస్వార్ధంగా ధనసహాయం చేసిన తానా సభ్యులందరికీ ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. స్వచ్చందంగా నిస్వార్ధంగా ధనసహాయం చేసిన తానా సభ్యులందరికీ ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
17వ తానా సమావేశాలకై ఇప్పటికి $500000 డాలర్ల విరాళాలు దక్కించుకున్న ఫైనాన్స్ కమిటీ అధ్యక్షురాలు ఉమాదేవిగారి దక్షతని నిబద్ధతని కొనియాడారు. ఈ క్రమశిక్షణ, సంస్థపైని అభిమానము మన యువతరానికి మార్గదర్శకం కావాలని, ముందుముందు యువతరం తానాని ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చగలరని తన గట్టి నమ్మకమని చెప్పారు. జులైలో రానున్న చికాగో తానా సమావేశాలు దిగ్విజయంగా జరుగుతాయని ఆయన ధృఢ విశ్వాసం తెలిపారు.
యువకళాకారుడు బలుసు సంజయ్ కర్ణరసోపేయమైన శాస్త్రీయ గానం, కిలాని సంధ్య, స్వప్న, అనూప్, పోసాని శ్యామలల నాట్య ప్రదర్శనలు, రామరాజ భూషణుడు వినోదాత్మక నిర్వహణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చక్కటి విందుభోజనంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఏప్రిల్ 11వ తేదీన చికాగో హిందూ దేవాలయంలో జరిగిన ట్రైస్టేటు తెలుగు సంస్థ ఉగాది పండుగ సందర్భంలో 17వ తానా మహాసభల కార్యవర్గం చికాగో తెలుగువారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని జులై 2,3,4 తేదీలలో జరుగనున్న తెలుగు సమావేశాలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Pages: -1- 2 -3- News Posted: 17 April, 2009
|