`తానా'కు విరివిగా విరాళాలు
ఈ కార్యక్రమానికి హాజరైన 500 పైబడిన చికాగో నగర వాసులకు 17వ తానా మహా సభల విశేషాలను విశద పరిచారు. కన్వీనర్ యడ్లపాటి యుగంధర్ వివిధ కమిటీ అధ్యక్షులను వేదికపై పరిచయం చేశారు. ఈ మూడు రోజుల తెలుగు వైభవాలకు `సాంకేతిక వికాసం - సాంస్కృతిక విన్యాసం' మకుటంగా గమనించి మన ప్రవాసాంధ్ర యువతరం ఖండ ఖండాంతర సాంకేతిక విజయాలు, అమెరికాలో పెరుగుతున్న తెలుగుతరం విద్యా వాణిజ్య కళా రంగాలలో ప్రకటిస్తున్న ప్రజ్ఞా ప్రాభవాలూ అందరి అవగాహనలోకి తీసుకురావటం ముఖ్యోద్దేశమని తెలిపారు.
తానా అధ్యక్షులు కాకరాల ప్రభాకర చౌదరి అమెరికా తెలుగు వారందరూ చికాగో సమావేశాలకు ఎదురు చూస్తున్నారని, దేశ విదేశాల నుండీ కళాకారుల ఆసక్తి చాలా ప్రోత్సహకరంగా ఉన్నదనీ, ఎంతో చక్కటి కార్యక్రమాలకు చికాగో తెలుగు వారి నిర్వాహక శక్తి ఊపిరి పోయగలదని భావిస్తున్నామన్నారు. ఫైనాన్స్ కమిటీ అధ్యక్షురాలు గవని ఉమాదేవి గారు వివిధ ప్రాంతాల తెలుగు సోదరుల విరాళాల వితరణ గురించి తెలియజేశారు. శొంఠి శారదా ఫూర్ణ గారు సాహిత్య కార్యక్రమాలలోని విశేషాలను ప్రకటించారు.
ఎలవర్తి రామరాజ భూషణుడు 17వ తానా మహా సభల ముఖ్యాంశాలను శ్రోతలకు హాశ్యస్ఫొరకంగా తెలియజేస్తూ మాటీవీ సహకారంతో `నా ఎద సవ్వడి' అనే సంగీత పోటీ కార్యక్రమాన్ని ఆంధ్ర దేశంలో, అమెరికాలో నిర్వహించి ఫైనల్స్ తానా సమావేశాల ప్రధాన వేదిక మీద ప్రత్యక్షంగా వినూత్న పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జీవిత సాఫల్య సత్కారం కూడా ఆవేదిక మీద జరుగుతుందని, యువతరం సినీనటుడు ఎన్టీఆర్, ఇంకా ఎందరో యువ సినీ కళాకారులతో సమకూర్చిన హాస్య నాటికలూ, మేడసాని మోహన్ గారి అష్టావధానం, మహాకవి సందేశం సాహితీపరులను ఎంతో ఉత్తేజ పరుస్తాయని సభికులకు వివరించారు. అందరి చేదోడు లభిస్తే 17వ తానా మహాసభలు చికాగో తెలుగువారికి మరోసారి గర్వ కారణం కాగలవని విజ్ఞప్తి చేశారు.
యువకళాకారుడు బలుసు సంజయ్ శాస్త్రీయ గానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది.
ట్రైస్టేట్ తెలుగు సంస్థ రజతోత్సవాల సందర్భంలో ఈ సమావేశాలు చికాగోలో జరపుకోవటం మరో విశేషమని అందరూ అభిప్రాయ పడ్డారు.
Pages: -1- -2- 3 News Posted: 17 April, 2009
|