`తానా' విజేత ప్రసాద్
హైదరాబాద్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో తోటకూర ప్రసాద్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి తిపిర్నేని తిరుమల రావుపై 1043 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రసాద్ కు 3,302 ఓట్లు, తిరుమల రావుకు 2,259 ఓట్లు వచ్చాయి.
తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి అత్యున్నతమైనది. ఈ పదవికి ఎన్నికైనవారు రెండేళ్ల తర్వాత సంస్థ అధ్య్యక్ష బాధ్యతలు చేపడతారు. 2007లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జయరాం కోమటి వచ్చే జూలైలో జరగనున్న తానా ద్వైవార్షిక ఉత్సవాల్లో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తోటకూర ప్రసాద్ రానున్న రెండేళ్ల కాలానికి జయరాంతో కలిసి పనిచేస్తూ 2009 జూలైలో అధ్యక్ష పదవిని అధిరోహిస్తారు.
Pages: 1 -2- News Posted: 20 April, 2009
|