`తానా' విజేత ప్రసాద్
ఏడాది కాలంగా వివాదాలతో సతమతమైన తానాలో చివరికి నాయకుల మధ్య రాజీ కుదిరినప్పటికీ మొదటినుంచీ సంస్థతో అనుబంధం కలిగివున్న పలువురు ప్రముఖులు మనస్తాపంతో ఎన్నికల ప్రక్రియను బహిష్కరించారు. దాంతో, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కెనడా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పదవులకు మాత్రమే పోటీ జరిగింది. కెనడా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ గా చిగురుపాటి మధుసూదన్ ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి కాసరనేని జ్యోత్స్నపై 342 ఓట్ల తేడాతో గెలిచారు. మధుసూదన్ కు 384 ఓట్లు, జ్యోత్స్నకు 42 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల కమిటీ చైర్మన్ కట్టమంచి ఉమాపతి రెడ్డి ప్రకటించారు.
మిగతా పదవులన్నింటికీ ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ లేకుండానే విజయం సాధించినట్లు ప్రకటించారు. కార్యదర్శిగా నన్నపనేని మోహన్, కోశాధికారిగా యలమంచిలి రామ్, సంయుక్త కార్యదర్శిగా ఉప్పల వీరు, సంయుక్త కోశాధికారిగా మారంరెడ్డి విద్యాసాగర్ ఎన్నికయ్యారు. ఇక ప్రాంతీయ ఉపాధ్యక్షుల విషయానికి వస్తే... ఈశాన్య ప్రాంతానికి గరికపాటి వెంకట్, తూర్పు ప్రాంతానికి కొల్లా సుబ్బారావు, ఆగ్నేయ ప్రాంతానికి వీరపనేని పూర్ణ, ఉత్తర ప్రాంతానికి వల్లభనేని రవి, వాయువ్య ప్రాంతానికి వెన్నం మురళి, పశ్చిమ ప్రాంతానికి అల్లూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తానా ఫౌండేషన్ సభ్యులుగా బండారుపల్లి సాంబశివరావు, గోగినేని శ్రీనివాస, కోయ హరీశ్, యార్లగడ్డ వెంకటరమణ ఎన్నికయ్యారు. ట్రస్టుబోర్డు సభ్యులుగా అక్కినేని మణి, కొడాలి నరేన్, ఉప్పులూరి వెంకట సుబ్బారావు ఎన్నికయ్యారు. డోనార్ ట్రస్టీగా చుక్కపల్లి ప్రసాద్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికల కమిటీలో శ్యాం అరిబింది, సుబ్బారావు పోతిన, ఆజాద్ సుంకవల్లి, శ్రీనివాస్ సూరుభొట్ల సభ్యులుగా ఉన్నారు.
Pages: -1- 2 News Posted: 20 April, 2009
|