విజయవంతంగా సిటిఎ శిక్షణ
శిక్షణ శిబిరం ద్వారా తమలో ఆత్మవిశ్వాసాన్ని, విధినిర్వహణలో పాటించాల్సిన మెళకువలను, ఇంటర్వ్యూ కోసం ఎలా ప్రిపేరవ్వాలి తదితర అంశాలపై చక్కని అవగాహన కల్పించిన షికాగో తెలుగు అసోసియేషన్ కు ఆహూతులందరూ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలోని ఇతర తెలుగు సంఘాల కన్నా విభిన్నంగా నిర్వహించిన ఈ ఉచిత శిక్షణ శిబిరానికి పలు ఇతర సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో తెలుగువారికి మరింత చేదోడు వాదోడుగా ఉండేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయా సంఘాల నాయకులు ముందుకు వచ్చారు.
ఈ ఉచిత శిక్షణ శిబిరం నిర్వహణకు తోడ్పాటు అందించిన ప్రవీణ్ మోటూరు, శ్రీకాంత్ దండా, శశి పలవల్ల, శ్రీహరి త్రిపురాని, రాజ్ కావూరు, గాయత్రి కల్లూరి తదితరులకు షికాగో తెలుగు అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. శిబిర నిర్వహణంలో వలంటీర్లుగా విశేష సేవలు అందించిన సాయి గవర్నేని, వేణు కొండూరు, శ్రీనివాస్ రెడ్డి సారికొండ, అమర్ నెట్టెం, అఖిల్ సారికొండ, శ్రీనివాస్ చుండు, లక్ష్మీనారాయణ తాతినేని, రావు ఆచంట, రమేశ్ మర్యాలలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో (టిఏజిసి) సంస్థ అందించిన సహాయ సహకారాలకు గాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. రానున్న మరి కొన్ని నెలల్లో ఇదే విధంగా మరిన్ని ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు షికాగో తెలుగు అసోసియేషన్ పేర్కొంది.
Pages: -1- 2 News Posted: 13 May, 2009
|