విజయవంతంగా సిటిఎ శిక్షణ
షికాగో : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రవాసాంధ్రులకు వారి విధుల్లో మరింత మెరుగైన అవగాహన కల్పించే ఉద్దేశంతో షికాగో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరానికి 60 మందికి పైగా ప్రవాసాంధ్ర ఉద్యోగార్థులు హాజరయ్యారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత ఆర్థిక మాంద్యం దెబ్బ నుంచి తట్టుకునే ధైర్యాన్నిచ్చేందుకు ప్రవాసాంధ్రులకు ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా తోడు నిలవాలని షికాగో తెలుగు అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుత ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు చేయూతనిచ్చేందుకు కాస్త మెరుగైన స్థితిలో ఉన్న తెలుగువారు, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన ఆవశ్యకతను షికాగో తెలుగు అసోసియేషన్ ఈ శిక్షణ శిబిరాల ద్వారా ముందు బాట వేసినట్లైంది. ఉద్యోగార్థులైన ప్రవాసాంధ్రుల్లో ఈ శిక్షణ శిబిరం చక్కని శక్తిని, అవగాహనను కలిగించింది. ఇంటర్వ్యూకు సన్నద్ధం అయ్యేందుకు అవసరమైన టిప్స్ ను అందించింది. ఇంటర్వ్యూ సందర్భంగా అభ్యర్థులు తమ ప్రతిభను ఎలా ప్రదర్శించుకోవాలి తదితర అంశాలపై ఈ శిబిరంలో చక్కని అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా జాబ్ కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించింది. నెట్ వర్క్ ను ఎలా రూపొందించుకోవాలి, రెజ్యూమ్ ను ఎలా రూపొందించాలని తదితర విషయాలపై షికాగో తెలుగు అసోసియేషన్ నిర్వహించిన శిక్షణ శిబిరంలో చక్కగా అవగాహన కల్పించారు.
Pages: 1 -2- News Posted: 13 May, 2009
|