వైఎస్ విక్టరీ కార్ ర్యాలీ
సాయంత్రం 4.15 గంటలకు కార్ ర్యాలీ ప్రారంభమైంది. ఐదు మైళ్ళు ప్రయాణించిన ర్యాలీ ఇర్వింగ్ లోని హాలీవుడ్ థియేటర్ల వద్ద ముగిసింది. భారీ యెత్తున కొనసాగిన ర్యాలీని స్థానిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ కెమెరాలు, వీడియోలలో చిత్రీకరించారు. వాహనదారులంతా వలంటీర్ల సహాయంతో తమ వాహనాలను థియేటర్ పక్కగా క్రమశిక్షణతో పార్క్ చేసి, తరువాత థియేటర్ లోకి ప్రవేశించారు. మహిళా కాంగ్రెస్ కు చెందిన పలువురు మహిళా సభ్యలు కూడా ఈ కార్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయోత్స కేక్ ను మహిళా సభ్యులు కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. 'అవర్ ప్లేస్' రెస్టారెంట్ యజమాని నరేంద్రబాబు ర్యాలీలో పాల్గొన్న అందరికీ వేడి వేడి సమోసా, టీ సరఫరా చేశారు.
కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడానికి గల ఆవశ్యకతను హాలులో జరిగిన సమావేశాన్ని నిర్వహించిన అజయ్ రెడ్డి వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డికి నివాళులు అర్పించిన సమావేశం ఒక్క నిమిషం మౌనం పాటించింది. డాక్టర్ తారాకుమార్ రెడ్డి, గోపీరెడ్డి చిల్లకూరు వైఎస్ నిర్వహిస్తున్న జలయజ్ఞం విశేషాలను వివరించారు. రావు కల్వల గత ఐదేళ్ళలో వైఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేశారు. వైఎస్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీ తెచ్చిపెట్టాయన్నారు. ప్రసాద్ రెడ్డి మల్లు, చెరుకు శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో ప్రసంగించారు.
రమణారెడ్డి క్రిస్టపాటి వందన సమర్పణ చేశారు. కార్ ర్యాలీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వీడియో చిత్ర ప్రదర్శనలు జరిగాయి. పిమ్మట ఇటీవల సంచలనం సృష్టించిన 'అరుందతి' చిత్రాన్ని ప్రదర్శించారు. చిత్ర ప్రదర్శన అనంతరం ఇర్వింగ్ లోని స్పైస్ ఇన్ రెస్టారెంట్ లో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ర్యాలీకి హాజరై, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|