వైఎస్ విక్టరీ కార్ ర్యాలీ
డల్లాస్ : ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరోసారి ఘన విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని డల్లాస్ లో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారీ విజయ కేతనం ఎగరేయడంతో ప్రవాసాంధ్రులు అత్యధిక సంఖ్యలో కార్ల ర్యాలీ తీశారు. మే 23 శనివారం ఈ కార్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించడమే కాకుండా లోక్ సభకు 33 మంది సభ్యులను పంపించింది. దేశం మొత్తంలో మరే రాష్ట్రమూ ఇవ్వనంత అత్యధిక మంది ఎం.పిలను ఆంధ్రప్రదేశ్ అందించడం ప్రవాసాంధ్రుల సంతోషానికి కారణమైంది.
కొద్ది మంది ఉత్సాహవంతులైన ప్రవాసాంధ్రుల మదిలో రూపుదిద్దుకున్నదే ఈ భారీ స్థాయిలో కార్ల ర్యాలీ కార్యక్రమం. ర్యాలీ అనంతరం ప్రసంగాలు, వీడియో చిత్ర ప్రదర్శన, ఫ్రీ సినిమా షో, రాత్రికి రుచికరమైన విందు కార్యక్రమం జరిగాయి.
ప్రముఖ ప్రవాసాంధ్రుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి మార్గదర్శనంలో అజయ్ రెడ్డి, రావు కల్వల, ప్రసాద్ రెడ్డి మల్లు, గోపీ రెడ్డి చిల్లకూరు, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, ఫిజీషియన్ డాక్టర్ తారాకుమార్ రెడ్డి లాంటి సాఫ్ట్ వేర్ వ్యాపార సంస్థల యజమానులు, వివిధ రంగాల్లో నిపుణులైన పలువురు ప్రవాసాంధ్రులు ఈ భారీ కార్య ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. చక్కని ముందస్తు ప్రణాళికతో ప్రారంభించిన ర్యాలీ, సమావేశాలు చక్కగా పూర్తయ్యాయి. ప్రసిద్ధి చెందిన భారతీయ రెస్టారెంట్ స్పైస్ ఇన్ యజమానులు ప్రతాప్ భీమిరెడ్డి, భీమ పెంట తమ హొటల్ లో సమావేశాలు నిర్వహించేందుకు హాలును ఉచితంగా ఏర్పాటు చేశారు.
వందలాది మంది ఔత్సాహికులు తమ తమ కార్లతో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకే ఇర్వింగ్ నగరంలోని జఫర్ సన్ పార్క్ దగ్గరకు మధ్యాహ్నం 3 గంటలకే చేరుకున్నారు. కార్ల ర్యాలీలో అగ్రభాగాన 1951లో తయారైన వింటేజ్ వాహనం ఫైర్ ట్రక్ నిలిచింది. దీనిని స్థానిక వ్యాపారవేత్త, టూరింగ్ టాకీస్ యజమాని మనోహర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ర్యాలీలో పాల్గొన్న కార్లన్నింటిపైన కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించిన జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు, ముఖాలకు వేసుకొనే ముసుగులు, విండ్ షీల్డ్ స్టిక్కర్లు, భారత, అమెరికా జాతీయ జెండాలతో అలంకరించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ స్కార్ఫ్ ను మెడచుట్టూ చుట్టుకున్నారు. నుదుటిన తిలకం దిద్దుకున్నారు. స్థానిక రేడియో వ్యాఖ్యాత రాజేశ్వరి చల్లా కార్యక్రమ నిర్వాహకులలో పలువురిని పలు ఆసక్తి కలిగించే ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేశారు. ర్యాలీకి ఇర్వింగ్ నగర పోలీసు విభాగం పోలీస్ కారు, ఆరు మోటార్ సైకిళ్ళపై ఎస్కార్ట్ ను ఏర్పాటు చేసింది.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|