వైఎస్సార్ యూత్ కార్ ర్యాలీ
అమెరికాలోని ప్రసిద్ధ వైద్యుల్లో ఒకరైన డాక్టర్ శామ్ కేసరి మాట్లాడుతూ, వైఎస్సార్ గత ఐదేళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యసేవలు అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేసిన వైఎస్ ను ఆయన అభినందించారు. వైఎస్సార్ యువసేన మీడియా కార్యదర్శి పాల భానోజీ రెడ్డి మాట్లాడుతూ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల రీయంబర్స్ మెంట్ చేయడాన్ని వేనోళ్ళ కొనియాడారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో విద్యాభ్యాసం కొనసాగించలేక మధ్యలోనే ఆగిపోతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు చక్కని చేయూతగా మారిందన్నారు.
భారతదేశం నుంచి వచ్చిన రిటైర్డ్ ఇంజనీర్ అంబారావు, గుంటూరు జిల్లాకు చెందిన రైతు సాంబిరెడ్డి, విపిన్ ముప్పిడి, నంద్యాల వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇనగంటి తదితరులు వైఎస్ నిర్వహిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి (సోమవారంనాడే కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు) సోదరి జక్కిరెడ్డి సుబ్బాయమ్మ మాట్లాడుతూ, మంచి హృదయంతో, సేవా దృక్పథంతో ఉండేవారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయనన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని మళ్ళీ ఎన్నికున్న తెలివైన వారు ఆంధ్రప్రదేశే ఓటర్లని కాంగ్రెస్ నాయకురాళ్ళు శ్రీమతి అనుపమ, సునీతారెడ్డి, రజన్ అభివర్ణించారు.
వైఎస్సార్ యువసేన అమెరికా కమిటీ గౌరవ సలహాదారు, వైఎస్సార్ విజయోత్సవ నిర్వాహకుడు మునగాల బ్రహ్మానందరెడ్డి సభకు హాజరైన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. వచ్చే 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ శాసనసభలో 230 స్థానాలు గెలుచుకునేలా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఇక ఈ విజయోత్సవాల్లో ప్రధానమైన కార్ ర్యాలీలో 100 కార్లు పాల్గొన్నాయి. ర్యాలీకి ముందుభాగంలో రెండు గుర్రాలు నడవగా ర్యాలీ కొనసాగింది. 'జయహో వైఎస్సార్', 'జిందాబాద్ వైఎస్సార్' నినాదాలతో ర్యాలీ ముందుకు సాగింది. ఈస్ట్ సైడ్ ఇన్ హొటల్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పది కిలోమీటర్ల దూరంలోని డేకల్బ్ హైస్కూల్ వద్ద ముగిసింది. వైఎస్సార్ యువసేన అమెరికా కమిటీ నిర్వహించిన ఈ విజయోత్సవాలకు హాజరైన ప్రతి ఒక్కరికీ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|