టాస్క్ వేసవి పిక్నిక్
చిన్నారుల విభాగంలో నిర్వహించిన పెయింటింగ్ పోటీలను కాలిఫోర్నియాకు చెందిన 'హాట్ బ్రీడ్స్ ఆఫ్ ఆర్టేసియా' సంస్థ స్పాన్సర్ చేసింది. పోటీలో పాల్గొన్న చిన్నారులకు స్నాక్స్, అల్పాహారాన్ని కూడా అందజేసింది. టస్టిన్ లోని 'దోశ ప్లేస్' మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చింది. పెద్దవారి విభాగంలో జరిగిన పోటీల విజేతలకు 'ఆసియన్ గ్రోసరీస్' సంస్థ అందజేసింది.
టాస్క్ క్రీడలు, గేమ్స్ విభాగం చైర్మన్ రామ యలమంచిలి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి, కోశాధికారి మురళి వెంకటరమణా రెడ్డి, వలంటీర్లకు కార్యనిర్వాహక కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఇతర విభాగాల చైర్మన్లు సీతారామ్ పమిరెడ్డి, విశాల్ శ్రీవాస్తవ, శేఖర్ సీరా, రాజు వేదాల, సాగర్ యర్రంశెట్టి, వంశీ బోయినపల్లి, అనిల్ మచ్చా, విజయ్ నెక్కంటి, ప్రసాద్ రాణి, రాఘవ పరుచూరిలకు కూడా కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది. 2009 ఐపిఎల్ చాంపియన్ షిప్ సాధించిన దక్కన్ చార్జర్స్ జట్టుకు టాస్క్ కమిటీ అభినందనలు తెలిపింది.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|