టాస్క్ వేసవి పిక్నిక్
కాలిఫోర్నియా : దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం నిర్వహించిన వార్షిక వేసవి పిక్నిక్ ఉత్సాహంగా, ఆనందకర వాతావరణంలో జరిగింది. మే 23న ఇర్విన్ లోని సుందరమైన హెరిటేజ్ పార్క్ లో జరిగిన వేసవి పిక్నిక్ కు ప్రవాసాంధ్ర నాయకులు ధర్మారెడ్డి గుమ్మడి, సుబ్బారావు మక్కమ, తాడి రామకృష్ణ, బత్తల చెంచయ్య, అనిల్ ఎర్రబెల్లి సహా 250 మందికి పైగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారని టాస్క్ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కోమటిరెడ్డి ఒక ప్రకనలో తెలిపారు.
పిక్నిక్ ను ఆసాంతం చక్కని హాస్యం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం నింపే విధంగా నిర్వాహకులు రూపొందించారు. ఈ పిక్నిక్ లో భాగంగా పరుగుపందెం, లింబో, లెమన్ స్పూన్ పరుగు, హులా - హూప్, లెగ్ రేస్, అన్ని వయస్సుల చిన్నారులకూ క్రికెట్ పోటీలు నిర్వహించారు. తమ విభాగంలో నిర్వహించిన వాలీబాల్, క్రికెట్ పోటీల్లో పెద్దలు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. పెద్దల విభాగంలో మహిళలు - పురుషుల జట్టుకు నిర్వహించిన 'టగ్ ఆఫ్ వార్' పోటీలో విజేతను నిర్ణయించడం టాస్క్ సంస్థకు ఓ పెద్ద సవాల్ అని చెప్పడంలో తప్పు లేదు. విజేతలు, రన్నరప్ వచ్చిన వారికి ప్రవాసాంధ్ర నాయకులు సుబ్బారావు మక్కం, తాడి రామకృష్ణ, టాస్క్ కార్యనిర్వాహక కమిటీ బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|