దాడులపై టిసిఎ ఖండన
దాడులు జరిగినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో ఒక పోలీస్ వెబ్ సైట్ ఇచ్చిన సేఫ్టీ టిప్స్ ను ఈ సందర్భంగా టిసిఎ అధ్యక్షుడు విజయ్ చవ్వ తన ప్రకటనలో పొందుపరిచారు.
అవి :
1) మన శరీరంలో మోచేయి చాలా బలీయమైనది. ఒకవేళ ఎవరి మీదనైనా దాడి జరిగితే, ప్రత్యర్థి సమీపంలో ఉంటే దానిని వినియోగించాలన్న విషయం గుర్తుంచుకోవాలి.
2) ఒకవేళ దొంగ మిమ్మల్ని నిర్బంధించి, పర్స్ ఇవ్వాలంటూ ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని తీసి ఇవ్వకుండా దూరంగా విసిరేసి వాడి నుంచి దూరంగా అడ్డదిడ్డంగా పరుగుపెట్టాలి.
3) దుండగులు మీపై దాడికి దిగినప్పుడు సహాయం కోసం బిగ్గరగా అరవాలి. సహాయపడేందుకు సమీపంలో ఎవరూ లేనప్పుడు 'నో' అంటూ చేతిని 'అగు' అన్నట్లుగా చూపించాలి.
4) ఒకవేళ ఎవరైనా మీ కారు మీదకు దూకి మీ తలకు తుపాకిని గురిపెట్టినప్పుడు కారును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు. పాదాన్ని గ్యాస్ పెడల్ మీద అదిమిపెట్టి కారు వేగాన్ని మరింత పెంచితే ఎయిర్ బ్యాగ్ మిమ్మల్ని కాపాడుతుంది.
5) మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల పట్ల ప్రతిక్షణమూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే జనం ఎక్కువగా ఉండే భవంతిలోకి వెళ్ళి, వెంటనే స్థానిక పోలీసులకు 911 నెంబర్ కు ఫోన్ చేసి సహాయం కోరాలి.
ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ను ఇవ్వొద్దు. మీ ధైర్యం మీద మీరు విశ్వాసం ఉంచుకోండి. మనలోని సిక్స్త్ సెన్స్ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. మీరు ఉన్న ప్రదేశంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తుందన్న అనుమానం కలిగితే వీలైనంత త్వరగా అక్కడి నుంచి మరోచోటకి వెళ్ళిపోవాలి. ఆస్ట్రేలియాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలని, మంచి భవిష్యత్ కలగాలని తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆకాంక్షిస్తున్నట్లు విజయ్ చవ్వ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 5 June, 2009
|