ఘంటసాల ఆరాధనోత్సవాలు
ఘంటసాలకు అత్యంత ఇష్టమైన గణేశ శ్లోకాన్ని గానం చేయడంతో ఈ సంగీత కార్యక్రమానికి చంద్రతేజ శ్రీకారం చుట్టారు. ఆ వెంటనే సందర్భానుసారంగా ఘంటసాల స్వయంగా స్వరపరచి, గానం చేసిన 'భలే మంచి రోజు... వసంతాలు పూచే నేటి రోజు' గీతాన్ని ఆలపించారు. చంద్రతేజ పాడిన ప్రతి పాటకు ఆహూతుల నుంచి చెప్పలేనంద హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఘంటసాల కంచుకంఠాన్ని పోలిన చంద్రతేజ పాడిన పాటలు ఆడిటోరియంలో వసంతాన్ని తీసుకువచ్చాయి.
అనంతరం విజయలక్ష్మి వేదిక మీదకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆహ్వానం లభించింది. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ, తనదైన శైలిలో చెణుకులు విసురుతూ విజయలక్ష్మి పాడిన పాటలు అందరినీ మైమరపించాయి. మిస్సమ్మ సినిమాలోని 'కనులు తెరిచినా నీవాయె' పాటతో విజయలక్ష్మి తన పాటల ఖాతాను తెరిచారు.
నిధుల సేకరణలోను, పరిమితమైన ప్రేక్షకులతోను టిఎల్ సిఎ నిర్వహించిన ఘంటసాల ఆరాధనోత్సవాలు ఘనంగా విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా 11 వేల డాలర్లు విరాళంగా లభించింది. ఈ మొత్తాన్ని చెక్కురూపంలో టిఎల్ సిఎ సభ్యులు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ వంశీ రామరాజుకు అందజేశారు. తమ సంస్థకు విరాళాలు సేకరించి అందజేసిన టిఎల్ సిఎ సంస్థకు, అధ్యక్షుడు వెంకటేశ్ ముత్యాల, ఆయన బృందానికి వంశీ రామరాజు కృతజ్ఞతలు తెలిపారు. టిఎల్ సిఎ సంయుక్త కార్యదర్శి నాగేంద్ర గుప్తా వందన సమర్పణతో ఘంటసాల ఆరాధనోత్సవాల కార్యక్రమం ముగిసింది.
Pages: -1- 2 News Posted: 9 June, 2009
|